'ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్' | Virat kohli is the best batsman in the world, says anurag thakur | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్'

Apr 6 2016 4:58 PM | Updated on Sep 3 2017 9:20 PM

'ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్'

'ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్'

భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు.

ముంబై: భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లి అంటే తనకెంతో ఇష్టమని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ తెలిపారు. కోహ్లికి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ప్రపంచంలో అతడే బెస్ట్ బ్యాట్స్ మన్ అని కితాబిచ్చారు. ఫేస్ బుక్ ద్వారా థాకూర్ అభిమానులతో ముచ్చటించారు. టీ20 వరల్డ్ కప్ లో ఫ్యాన్స్ అందించిన మద్దతు మరవలేనిదని అన్నారు. టీమిండియా ఫైనల్ కు చేరకపోయినా తుదిపోరులో తలపడిన జట్లకు అభిమానులు అండగా నిలవడం అద్భుతమని పేర్కొన్నారు.

ఇండియా ఏ, అండర్-19 క్రికెట్ టీమ్స్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ గొప్పగా పనిచేస్తుడని ప్రశంసించారు. 1983లో చాంఫియన్లను సముచితంగా సత్కరించేందుకు బీసీసీఐ వద్ద డబ్బు లేదని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిందన్నారు. ప్రపంచ క్రికెట్ ను ఇప్పుడు మనం శాసిస్తున్నామని థాకూర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement