విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ | virat kohli gets half century | Sakshi
Sakshi News home page

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

Dec 10 2016 12:59 PM | Updated on Sep 4 2017 10:23 PM

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 113 బంతుల్లో 5 ఫోర్లతో అర్థశతకం చేశాడు.

ముంబై:ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు. 113 బంతుల్లో 5 ఫోర్లతో అర్థశతకం చేశాడు. అంతకుముందు భారత ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం సాధించాడు. కాగా, అబ్దుల్ రషిద్ వేసిన ఓవర్లో అతనికే క్యాచ్ ఇచ్చి విజయ్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. విరాట్ తో కలిసి 76 పరుగులు జత చేసిన తరువాత విజయ్ పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కరుణ్ నాయర్తో కలిసి ఇన్నింగ్స్ను నడిపించిన కోహ్లి హాఫ్ సెంచరీ సాధించాడు.  ఇది విరాట్ టెస్టు కెరీర్లో 15 హాఫ్ సెంచరీ.

 

మూడో రోజు ఆటలో  146/1  ఓవర్ నైట్ స్కోరు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. దీనిలో భాగంగా ఓవర్ నైట్ ఆటగాడు మురళీ విజయ్ శతకం పూర్తి చేసుకోగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు చటేశ్వర పూజారా(47) హాఫ్ సెంచరీని తృటిలో కోల్పోయాడు.ఇన్నింగ్స్ ఆరంభించిన రెండో బంతికే పూజారాను బాల్ బౌల్డ్ చేశాడు. దాంతో భారత్ జట్టు 146 పరుగుల వద్దే రెండో వికెట్ను నష్టపోయింది.  ఈ తరుణంలో విజయ్కు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి సమయోచితంగా ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.ఈ క్రమంలోనే విజయ్ తన టెస్టు కెరీర్లో ఎనిమిదో సెంచరీ నమోదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement