కోహ్లి సెంచరీ అనంతరం మరోసారి..

Virat Kohli flying kiss to His Wife Anushka Sharma For The Century - Sakshi

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి వీరోచితంగా బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీతో చెలరేగడంతో టీమిండియా ఆతిథ్య జట్టుకు 521  పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో ఘోరంగా విఫలమైన కోహ్లి ప్రస్తుత సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. తొలి టెస్టులో సెంచరీతో ఆకట్టుకోగ.. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లి టెస్టుల్లో 23వ సెంచరీ సాధించాడు. 

అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్‌
సెంచరీ చేసిన అనంతరం విరాట్‌ కోహ్లి స్టేడియం గ్యాలరీలో ఉన్న తన సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ నటి అనుష్క శర్మకు బ్యాట్‌తో గాల్లో ముద్దులు విసిరాడు. బదులుగా అనుష్క కూడా కోహ్లికి ఫ్లైయింగ్‌ కిస్సెస్‌ ఇచ్చింది. ఇప్పుడు ఈ ‍క్యూట్‌ కపుల్‌కు సంబంధించిన ముద్దుల వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తొలి టెస్టులో కూడా సెంచరీ అనంతరం నిశ్చితార్థపు ఉంగరాన్ని ముద్దు పెట్టుకొని అనుష్కపై తనకున్న ప్రేమను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పాడు. ప్రస్తుతం అనుష్క శర్మ కోహ్లితో కలిసి ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో ఘోర ఓటమి తర్వాత కోహ్లి- అనుష్కలపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.  

చదవండి: విరాట్‌ కోహ్లి రికార్డుల పర్వం

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top