కెరీర్‌ బెస్ట్‌ర్యాంకులో కోహ్లి | Virat Kohli claims career-best second spot in ICC Test rankings | Sakshi
Sakshi News home page

కెరీర్‌ బెస్ట్‌ర్యాంకులో కోహ్లి

Dec 14 2016 12:36 AM | Updated on Sep 4 2017 10:38 PM

కెరీర్‌ బెస్ట్‌ర్యాంకులో కోహ్లి

కెరీర్‌ బెస్ట్‌ర్యాంకులో కోహ్లి

అద్భుత ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించాడు.

దుబాయ్‌: అద్భుత ఫామ్‌లో ఉన్న భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లో ఉత్తమ ర్యాంక్‌ను సాధించాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన తాజా జాబితాలో అతడు ఒక స్థానం ఎగబాకి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కోహ్లి పరుగుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నంబర్‌వన్‌గా ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ కన్నా తను 11 పాయింట్లు మాత్రమే వెనకబడ్డాడు. మురళీ విజయ్‌ ఐదు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ ర్యాంకులో, జయంత్‌ యాదవ్‌ 56వ ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్‌ విభాగంలో భారత స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 904 రేటింగ్‌ పాయింట్లతో ఉన్న అశ్విన్‌.. మురళీధరన్‌ (920) తర్వాత రెండో అత్యుత్తమ ఆఫ్‌ స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఈ చెన్నై బౌలర్‌ తన టాప్‌ ర్యాంకును కాపాడుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement