టేబుల్ టెన్నిస్ చాంప్స్ వరుణి, విఘ్నయ్ | varuni and vignai won table tennis titles | Sakshi
Sakshi News home page

టేబుల్ టెన్నిస్ చాంప్స్ వరుణి, విఘ్నయ్

Aug 9 2016 11:11 AM | Updated on Sep 4 2018 5:21 PM

సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో విఘ్నయ్ రెడ్డి, వరుణి జైశ్వాల్ విజేతలుగా నిలిచారు.

హైదరాబాద్: సెయింట్ పాల్స్ వార్షిక టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ లో విఘ్నయ్ రెడ్డి, వరుణి జైశ్వాల్ విజేతలుగా నిలిచారు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విఘ్నయ్ రెడ్డి (ఆర్‌బీఐ)11-08, 09-11, 11-02, 11-08తో అమన్ (ఐటీ)పై విజయం సాధించగా... మహిళల ఫైనల్లో వరుణి జై శ్వాల్ (జీఎస్‌ఎమ్) 11-09, 07-11, 11-09, 05-11, 08-11, 11-07, 11-07తో నైనా జైశ్వాల్ (ఎల్‌బీఎస్)ను ఓడించింది.

 

జూనియర్ బాలికల విభాగంలో నైనా జైశ్వాల్ 11-08, 11-07, 11-09, 11-06తో వరుణిపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీలిమ, రాష్ట్ర టేబుల్ టెన్నిస్ సంఘం ఉపాధ్యక్షుడు కె.కె.మహేశ్వర్, సంయుక్త కార్యదర్శి నరసింహారావు, సెయింట్ పాల్ హైస్కూల్ ప్రిన్సిపల్ రాయప్పరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement