'ఈ విజయం ఎంతో మధురం' | Sakshi
Sakshi News home page

'ఈ విజయం ఎంతో మధురం'

Published Mon, Sep 14 2015 9:10 AM

'ఈ విజయం ఎంతో మధురం' - Sakshi

న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టైటిల్ విజయం తనకు ఎంతో మధురమైనదని ప్రపంచ నంబర్ వన్ నోవాక్ జొకోవిచ్ అన్నాడు. రెండో ర్యాంకర్ రోజర్ ఫెడరర్తో జరిగిన ఫైనల్ సమరంలో సెర్బియా స్టార్ జొకోవిచ్ విజయం సాధించాడు. మ్యాచ్ విజయానంతరం జొకోవిచ్ మాట్లాడుతూ.. 'నేనో భర్తను, తండ్రిని. ఈ విజయం మరింత మధురమైనది' అని అన్నాడు.

జొకోవిచ్ యూఎస్ ఓపెన్ గెలవడమిది రెండో సారి. ఈ ఏడాది తన ఖాతాలో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ జమచేసిన జొకోవిచ్ తన కెరీర్లో పదో గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించాడు.

Advertisement
 
Advertisement
 
Advertisement