తొలి రెండు మ్యాచ్లకు ఉన్ముక్త్ చంద్! | Unmukt Chand named Delhi skipper for first two Ranji Trophy matches | Sakshi
Sakshi News home page

తొలి రెండు మ్యాచ్లకు ఉన్ముక్త్ చంద్!

Sep 30 2016 1:36 PM | Updated on Sep 4 2017 3:39 PM

తొలి రెండు మ్యాచ్లకు ఉన్ముక్త్ చంద్!

తొలి రెండు మ్యాచ్లకు ఉన్ముక్త్ చంద్!

ఈ సీజన్లో జరిగే రంజీ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు ఢిల్లీ కెప్టెన్గా ఉన్ముక్త్ చంద్ను నియమించారు.

ఢిల్లీ: ఈ సీజన్లో జరిగే రంజీ టోర్నీలో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు ఢిల్లీ కెప్టెన్గా ఉన్ముక్త్ చంద్ను నియమించారు. ఈ రంజీ జట్టుకు సంబంధించి సీనియర్ ఆటగాళ్లైన గౌతం గంభీర్, విరాట్ కోహ్లిలు జాతీయ జట్టుకు ఆడుతుండటంతో ఉన్ముక్ను సారథిగా నియమిస్తూ డీడిసీఏ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ తన తొలి రెండు రంజీ మ్యాచ్లను అస్సాం, మహారాష్ట్రలతో ఆడనుంది.

ఈ మేరకు 15 సభ్యులతో కూడిన ఢిల్లీ జట్టును ప్రకటించారు. ఇందులో  సీమర్లు పవన్ సుయాల్, నవదీప్ సైనీ, వికాస్ తోకర్, ప్రదీప్ సంగ్వాన్, పర్విందర్ అవానాలకు చోటు దక్కింది. అయితే మరో సీమర్ సరాంగ్ రావత్ కు జట్టులో చోటు దక్కలేదు. గత సీజన్లో రెండు మ్యాచ్లు ఆడిన రావత్ వికెట్లు తీయడంలో విఫలం చెందడంతో అతనికి చోటు కల్పించలేదు. ఇదిలా ఉండగా, ఓపెనర్గా మోహిత్ శర్మ తిరిగి జట్టులో కలవనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement