భారత్‌ తొలి పోరు ఆసీస్‌తో | Under-19 World Cup Schedule Released | Sakshi
Sakshi News home page

భారత్‌ తొలి పోరు ఆసీస్‌తో

Aug 18 2017 12:35 AM | Updated on Sep 12 2017 12:20 AM

వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది.

అండర్‌–19 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల  

దుబాయ్‌: వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 3 వరకు న్యూజిలాండ్‌లో జరిగే అండర్‌–19 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన భారత కుర్రాళ్లు తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలి యాను ఎదుర్కోనున్నారు. గ్రూప్‌ ‘బి’లో ఈ రెండు జట్లతో పాటు జింబాబ్వే, పపువా న్యూ గినియా జట్లు కూడా ఉన్నాయి. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌... న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

మ్యాచ్‌లు క్రైస్ట్‌చర్చ్, క్వీన్స్‌టౌన్, టౌరంగ, వాంగరీలోని ఏడు మైదానాల్లో జరుగుతాయి. ప్రతీ గ్రూప్‌లోని టాప్‌–2 జట్లు సూపర్‌ లీగ్‌కు అర్హత సాధిస్తాయి. వీటి మధ్య క్వార్టర్స్, సెమీ స్, ఫైనల్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. మిగిలిన 8 జట్ల మధ్య ప్లేట్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. ఇది కూడా ప్రధాన టోర్నీతో పాటే జరగడంతో పాటు జనవరి 28న ఫైనల్‌ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement