ఆర్‌బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్‌ వచ్చేసింది.. | RBI Announces MPC Schedule For FY 2026-27 First Meeting Set For April 6th To 8th, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ పాలసీ మీటింగుల షెడ్యూల్‌ వచ్చేసింది..

Mar 26 2026 12:07 PM | Updated on Mar 26 2026 1:13 PM

RBI Announces MPC Schedule for FY 2026 27 First Meeting Set for April 6 8

ముంబై: మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశ షెడ్యూల్‌ను ఆర్‌బీఐ ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొలి సమీక్ష ఏప్రిల్‌ 6–8 తేదీల మధ్య ఉంటుంది. ఆర్‌బీఐ గవర్నర్‌ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల ఎంపీసీ కమిటీ మొత్తం మీద 2026–27లో ఆరుసార్లు సమావేశం కానుంది. ద్వితీయ ద్వైమాసిక సమీక్షా సమావేశం జూన్‌ 3–5 తేదీల మధ్య ఉంటుంది. ఆ తర్వాత ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్, 2027 ఫిబ్రవరి నెలల్లో తదుపరి ఎంపీసీ భేటీలు ఉంటాయి.

ప్రతీ సమీక్ష మూడు రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ మీడియాకు వెల్లడిస్తుంటారు. ఆరుగురు సభ్యుల్లో ఆర్‌బీఐ గవర్నర్‌తోపాటు మరో ఇద్దరు ఆర్‌బీఐ అధికారులు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యులు భాగంగా ఉంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరిగా ఫిబ్రవరిలో ఎంపీసీ సమీక్ష ముగియడం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement