కాన్పూర్‌లో స్లో వికెట్ | tomorrow first ODI with South Africa | Sakshi
Sakshi News home page

కాన్పూర్‌లో స్లో వికెట్

Oct 9 2015 11:56 PM | Updated on Sep 3 2017 10:41 AM

భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం కాన్పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు

దక్షిణాఫ్రికాతో తొలి వన్డే రేపు
 

కాన్పూర్: భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం కాన్పూర్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు స్లో వికెట్ సిద్ధంగా ఉంది. ఇక్కడి గ్రీన్‌పార్క్ స్టేడియంలో పిచ్ స్వభావాన్ని మార్చడం కష్టమని స్థానిక క్యురేటర్ చెబుతున్నారు. తొలి వన్డేలో భారీ స్కోర్లు వచ్చే అవకాశం ఉందని, స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే తొలి వన్డే డే మ్యాచ్ కాబట్టి మంచు ప్రభావం కూడా ఉండదు.
 
వన్డే సిరీస్ షెడ్యూల్
అక్టోబరు 11: తొలి వన్డే, కాన్పూర్
14: రెండో వన్డే, ఇండోర్
 18: మూడో వన్డే, రాజ్‌కోట్
22: నాలుగో వన్డే, చెన్నై
25: ఐదో వన్డే, ముంబై
 

Advertisement
 
Advertisement
Advertisement