భారత మహిళల జట్లలో ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు | Three Andhra Women Cricketers In Indian Team | Sakshi
Sakshi News home page

భారత మహిళల జట్లలో ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు

Jan 11 2020 10:04 AM | Updated on Jan 11 2020 10:04 AM

Three Andhra Women Cricketers In Indian Team - Sakshi

ముంబై: నాలుగు జట్ల అంతర్జాతీయ టి20 మహిళల క్రికెట్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత ‘ఎ’, ‘బి’ జట్లను భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు రావి కల్పన, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి ఎంపికయ్యారు. పట్నాలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌ ‘ఎ’... ‘బి’ జట్లతోపాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్‌ జట్లు బరిలోకి దిగుతాయి.

దేశవాళీ టోర్నీల్లో రైల్వే స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డు (ఆర్‌ఎస్‌పీబీ) తరఫున ఆడే కల్పన భారత ‘ఎ’ జట్టులో...  మేఘన, అంజలి భారత ‘బి’ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత ‘ఎ’ జట్టుకు దేవిక వైద్య... భారత ‘బి’ జట్టుకు స్నేహ రాణే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement