ఈసారి గెలుస్తాం: తెలుగు టైటాన్స్‌ | This time we will win: Telugu Titans | Sakshi
Sakshi News home page

ఈసారి గెలుస్తాం: తెలుగు టైటాన్స్‌

Jul 25 2017 11:53 PM | Updated on Sep 5 2017 4:51 PM

ఈసారి గెలుస్తాం: తెలుగు టైటాన్స్‌

ఈసారి గెలుస్తాం: తెలుగు టైటాన్స్‌

ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలుస్తామని తెలుగు టైటాన్స్‌ జట్టు

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ ఐదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. ఈసారి కచ్చితంగా టైటిల్‌ను గెలుస్తామని తెలుగు టైటాన్స్‌ జట్టు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో టైటాన్స్‌ యాజమాన్యం జట్టు సభ్యులను పరిచయం చేసింది. ఈ సందర్భంగా  టైటాన్స్‌ జట్టు యజమాని గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ టైటిలే లక్ష్యంగా ఈసారి బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. తమ జట్టు సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సీజన్‌లో కూడా రాహుల్‌ చౌదరి కెప్టెన్‌ కొనసాగనున్నాడు. ఈనెల 28నుంచి ఆగస్టు 3వరకు హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, సచిన్‌ యజమానిగా వ్యవహరిస్తోన్న తమిళ్‌ తలైవాస్‌ జట్టుతో తలపడుతుంది.  ఈసారి సీజన్‌లో 4 కొత్త ఫ్రాంచైజీలతో కలిపి మొత్తం 12 ఫ్రాంచైజీలు బరిలోకి దిగనున్నాయి. ఇందులో 9 దేశాలకు చెందిన 27 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement