తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన | Telangana Throwball Team Announced | Sakshi
Sakshi News home page

తెలంగాణ త్రోబాల్‌ జట్ల ప్రకటన

Mar 21 2019 10:11 AM | Updated on Mar 21 2019 10:11 AM

Telangana Throwball Team Announced - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సబ్‌ జూనియర్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్లను బుధవారం ప్రకటించారు. బాలికల జట్టుకు కోచ్‌గా ఎం. అవినాశ్, మేనేజర్‌గా అరుణ కుమారి... బాలుర జట్టుకు కోచ్‌గా కె. అరుణ్‌ కుమార్, మేనేజర్‌గా జి. అశ్విన్‌ కుమార్‌ వ్యవహరించనున్నారు. హరియాణాలోని పానిపట్‌లో ఈనెల 23 నుంచి 25 వరకు జాతీయ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర జట్లకు ఎంపికైన క్రీడాకారులకు తెలంగాణ త్రోబాల్‌ సంఘం కార్యదర్శి ఎస్‌. సోమేశ్వర్‌ స్పోర్ట్స్‌ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ డీవైఎస్‌ఓ ఎస్‌. సుధాకర్‌ రావు పాల్గొన్నారు.

జట్ల వివరాలు
బాలికలు: ప్రాచి దేశ్‌పాండే, సైనా కుమారి, రుక్మిణీ కుమారి మిశ్రా, మహీన్‌ రూహి, అమృత వర్షిణి, యశస్వి, కె. మిరెల్లీ, ప్రియాంక చౌదరి, శ్రీహా రెడ్డి, స్రవంతి రెడ్డి, శాలిని ప్రియ, ఎ. స్నేచ్ఛ సోనాల్, టి. హారిక, హిమాని, యు. ఇందు.  
బాలురు: టి. రాజారామ్, పి. శ్రీనివాస్, బాలాజీ, ఎన్‌. స్వామి, బి. రాజు, ఎం. అక్షిత్, జి. నితిన్, కె.కుల్దీప్, రుణీత్‌ రెడ్డి, మణికాంత్, సందేశ్, జి.గణేశ్, సిద్ధార్థ్‌ రెడ్డి, జి. భగవంత్‌ రావు. 

Advertisement
 
Advertisement
Advertisement