ఫెన్సింగ్‌లో తెలంగాణకు రజతం | Telangana Gets Silver in Fencing Championship | Sakshi
Sakshi News home page

ఫెన్సింగ్‌లో తెలంగాణకు రజతం

Dec 31 2018 10:27 AM | Updated on Dec 31 2018 10:27 AM

Telangana Gets Silver in Fencing Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ జూనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఫెన్సర్లు సత్తా చాటారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర ఫెన్సింగ్‌ జట్టు రజత పతకం సాధించగా... వ్యక్తిగత విభాగంలో ఓ కాంస్యం దక్కింది. ఫాయిల్‌ టీమ్‌ విభాగంలో టి. భాగ్యశ్రీ, షేక్‌ ఫౌజియా, కె. గౌరి, శిరీషలతో కూడిన రాష్ట్ర జట్టు ఫైనల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫాయిల్‌ వ్యక్తిగత విభాగంలో భాగ్యశ్రీ కాంస్య పతకం చేజిక్కించుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement