బంగారు పతకాల తెలంగాణ రావాలి | telanagana should be 'gold', hopes venkateswara reddy | Sakshi
Sakshi News home page

బంగారు పతకాల తెలంగాణ రావాలి

Jan 9 2017 10:27 AM | Updated on Sep 5 2017 12:49 AM

బంగారు పతకాల తెలంగాణ రావాలి

బంగారు పతకాల తెలంగాణ రావాలి

తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆకాంక్షించారు.

‘శాట్స్’ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి  



హైదరాబాద్: రాబోయే రోజుల్లో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు బంగారు పతకాలు సాధించాలని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ఇటీవల సెయిలింగ్‌లో జాతీయ స్థారుులో 6 పతకాలు సాధించిన విద్యార్థులకు ఆదివారం యాట్ క్లబ్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కులో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయ న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధిం చాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారని... అలాగే తెలంగాణలోని క్రీడాకారులు ప్రతి అంశంలోనూ బంగారు పతకాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

 

ఆ దిశగా ప్రతి క్రీడాకారుడు ముందుకు సాగేలా ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. సామాన్యమైన విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ అందిస్తూ వారికి అన్ని విధాలా సహకారం అందిస్తూ యాట్ క్లబ్ చేస్తున్న కృషి అమోఘమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాట్ క్లబ్ అధ్యక్షులు కెప్టెన్ కేఎస్‌రావు, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు రంగారావు, నాంది ఫౌండేషన్ ప్రతినిధులు రోహిన ముఖర్జీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత శాంతా సిన్హా, యాట్ క్లబ్ వ్యవస్థాపకులు సోహిమ్, గణేష్ బాలకిషన్, ఆశ్విన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement