అప్‌డేట్స్‌: కివీస్‌పై భారత్‌ గెలుపు

Team India Vs New Zealand First One Day Live Cricket Score - Sakshi

నేపియర్‌: ఆస్ట్రేలియా పర్యటనను దిగ్విజయంగా ముగించిన టీమిండియా న్యూజిలాండ్‌ గడ్డపై కూడా అదే ఊపును కొనసాగించింది. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కోహ్లిసేన అదరగొట్టింది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో సమిష్టిగా రాణించి డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు కుల్దీప్‌ (4/39), షమీ(3/19), చహల్‌( 2/43), కేదార్‌ జాదవ్(1/17)లు చెలరేగటంతో 38 ఓవర్లలో 157 పరుగులకే ఆతిథ్య జట్టు ఆలౌటైంది.

  • ప్రస్తుతం టీమిండియా 30 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. క్రీజులో ధావన్‌(66), రాయుడు(6) ఉన్నారు. 
  • 132 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. ఫెర్గుసన్‌ బౌలింగ్‌లో సారథి విరాట్‌ కోహ్లి(45) కీపర్‌ క్యాచ్‌ ఔట్‌.
  • నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(60), సారథి విరాట్‌ కోహ్లి(41). ప్రస్తుతం టీమిండియా 26 ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టానికి 123 పరుగులు చేసింది. 
  • వన్డే కెరీర్‌లో 26వ అర్ధ సెంచరీ సాధించిన శిఖర్ ధావన్‌
  • ఆటకు స్వల్ప అంతరాయం కలగడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ను 49 ఓవర్లకు కుదించి 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన అంపైర్లు. 
  • విరామం తర్వాత తిరిగి ప్రారంభమైన మ్యాచ్‌
  • ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసిన అంపైర్లు
  • లంచ్‌ విరామం అనంతరం కోహ్లి సేనుక షాక్‌ తగిలింది. 41 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. బ్రేస్‌వెల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ(11) గప్టిల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం టీమిండియా పది ఓవర్లలో ఒక్క వికెట్‌ నష్టానికి 44 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (29), కోహ్లి(2)లు క్రీజులో ఉన్నారు.  
  • న్యూజిలాండ్‌ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిని టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ(11), శిఖర్‌ ధావన్‌(29)లు శుభారంభాన్ని అందించారు. లంచ్‌ విరామ సమయానికి భారత్‌ 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. 

కివీస్ ఇన్నింగ్స్‌
టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్‌ 157 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్‌ బౌలింగ్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌(0) వెనుదిరగటంతో 38 ఓవర్లలోనే కివీస్‌ కథ ముగిసింది.  అంతక ముందు కుల్దీప్‌ బౌలింగ్‌లోనే విలియమ్సన్‌(64), బ్రాస్‌వెల్‌(7), ఫెర్గుసన్‌(0)లు వెనుదిరిగారు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో సాన్‌ట్నర్(14) ఎల్బీడబ్య్లూగా వెనుదిరిగాడు. ఓ వైపు వరసుగా వికెట్లు పడుతున్నా.. మరోవైపు కివీస్ సారథి విలియమ్సన్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తనదైన క్లాస్‌ షాట్‌లతో అలరించాడు. . ఈ క్రమంలోనే వన్డే కెరీర్‌లో 36వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. కేదార్‌ జాదవ్‌ బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌ కళ్లు చెదిరేరీతిలో డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకోవడంతో కివీస్‌ బ్యాట్స్‌మన్‌ నికోలస్‌(12) పెవిలియన్‌ బాట పట్టాడు. కుల్దీప్‌ ఆ రీతిలో క్యాచ్‌ అందుకుంటాడని ఊహించని నికోలస్‌ అనూహ్యంగా ఔట్‌ అవుటవ్వడంతో భారంతో క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం కివీస్‌ 26 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.


ఇక కివీస్‌ సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌(22), లాథమ్‌(11)లను మణికట్టు స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ ఔట్‌ చేశాడు. 18పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌ను ఆ జట్టు సారథి విలియమ్సన్, టేలర్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 34 పరుగులు జోడించిన అనంతరం చహల్‌ బౌలింగ్‌లో టేలర్‌ రిటర్న్‌ క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన లాథమ్‌ను కూడా చహల్‌ క్రీజులో ఎక్కువసేపు నిలువనీయలేదు. లాథమ్‌ కూడా చహల్‌ బౌలింగ్‌లోనే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

 
అంతక ముందు ఆదిలోనే గప్టిల్‌, మున్రో వికెట్లను తీసి కివీస్‌కు కోహ్లి సేన గట్టి షాక్‌ ఇచ్చింది. టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ తన వరుస ఓవర్లలో కివీస్‌ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపించాడు. తొలుత కివీస్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ గప్టిల్‌(5)ను తన అద్భుత బంతికి బోల్తా కోట్టించిన షమీ.. తన తరువాతి ఓవర్లోనే మరో ఓపెనర్‌ మున్రో(8)ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి విలియమ్సన్‌ తొలుత బ్యాటింగ్‌కే మొగ్గుచూపాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top