అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా | Team India Loses Top Place To England In ICC ODI Rankings | Sakshi
Sakshi News home page

అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా

May 2 2018 3:19 PM | Updated on May 2 2018 5:18 PM

Team India Loses Top Place To England In ICC ODI Rankings - Sakshi

విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని (ఫైల్‌ ఫొటో)

దుబాయ్‌: టెస్టుల్లో అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్న టీమిండియాకు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నిరేశే ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ర్యాంకులు ప్రకటించగా.. వన్డేల్లో కోహ్లి సేన నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. ఇంగ్లండ్ 125 పాయింట్లతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా, టీ20ల్లో భారత్ రెండు పాయింట్లు సాధించినా.. మూడో స్థానంలోనే కొనసాగుతోంది. వన్డే ర్యాంకుల విషయంలో 2015-16, 2016-17 సీజన్లను లెక్కలోకి తీసుకుని ఐసీసీ తాజా ర్యాంకులను వెల్లడించింది. ఒక పాయింట్ కోల్పోయిన భారత్ 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 8 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్ అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2013 జనవరి తర్వాత ఇంగ్లండ్ టాప్ ర్యాంకు దక్కించుకుకోవడం ఇదే తొలిసారి.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
1. ఇంగ్లండ్        125 పాయింట్లు
2. భారత్        122     ''
3. దక్షిణాఫ్రికా    113    ''
4. న్యూజిలాండ్‌     112    ''
5. ఆస్ట్రేలియా    104    ''
పాకిస్తాన్‌(102), బంగ్లాదేశ్‌ (93), శ్రీలంక(77), వెస్టిండీస్‌ ‌(69), అఫ్గానిస్తాన్‌ (63) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
పొట్టి ఫార్మాట్ ర్యాంకుల్లో మాత్రం అంతగా మార్పుల్లేవు. టాప్-5 జట్లు అదే ర్యాంకులో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ 130 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లండ్‌ (115), దక్షిణాఫ్రికా(114) టాప్ 5 స్థానాలు మళ్లీ నిలబెట్టుకున్నాయి. టీమిండియా రెండు పాయింట్లు సాధించినా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. దిగ్గజాల రిటైర్మెంట్‌తో శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎంతగా అంటే.. పసికూన అఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంను వెనక్కునెట్టి 8వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ (10) చివరి స్థానంలో నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement