టీమిండియా టార్గెట్‌ 114 పరుగులు | T20 Womens World Cup : India Need 114 Runs To Win The Match Against Srilanka | Sakshi
Sakshi News home page

టీమిండియా టార్గెట్‌ 114 పరుగులు

Feb 29 2020 11:15 AM | Updated on Feb 29 2020 12:09 PM

T20 Womens World Cup : India Need 114 Runs To Win The Match Against Srilanka - Sakshi

మెల్‌బోర్న్‌ : టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో శ్రీలంక టీమిండియాకు 114 పరుగుల స్వల్ప విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో లంక 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక బ్యాట్స్‌వుమెన్లలో చమారి ఆతపత్తు 33 పరుగులు, కవిషా దిల్హరి 25* పరుగులతో రాణించగా మిగతావారు పూర్తిగా విఫలమయ్యారు.

భారత బౌలర్లలో రాదా యాదవ్‌ 4 వికెట్లతో సత్తా చాటగా, రాజేశ్వరి గైక్వాడ్‌ 2, శిఖా పాండే, పూనమ్‌ యాదవ్‌, దీప్తి శర్మ తలా ఒక వికెట్‌ తీశారు. ఇన్నింగ్స్‌ ఆసాంతం భారత బౌలర్ల దాటికి లంక బ్యాట్స్‌వుమెన్‌ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కాగా ఇప్పటికే హాట్రిక్‌ విజయాలతో సెమీస్‌ కు దూసుకెళ్లిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి గ్రూఫ్‌ టాపర్‌గా నిలవనుంది. ప్రసుత్తమున్న టీమిండియా బ్యాటింగ్‌ లైనఫ్‌ చూస్తే 114 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో పెద్దగా కష్టపడనక్కర్లేదనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement