అర్జున్‌ టెండూల్కర్‌కు  రూ. 5 లక్షలు

 T20 Mumbai League: Arjun Tendulkar picked for Rs 5 lakh - Sakshi

అతని కోసం పోటీపడిన ఫ్రాంచైజీలు

ముంబై: భారత బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ స్థానిక లీగ్‌లో ఆడేందుకు రూ. 5 లక్షలకు అమ్ముడుపోయాడు. ముంబై టి20 లీగ్‌లో ఆకాశ్‌ టైగర్స్‌ ముంబై వెస్టర్న్‌ సబర్బ్‌ జట్టు అతడిని రూ. 5 లక్షలకు కొనుగోలు చేసింది. ఆల్‌రౌండర్ల కేటగిరీలో ఉన్న అతని ప్రాథమిక ధర రూ. లక్ష కాగా... వేలంలో అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.

గరిష్ట ధర అయిన రూ. 5 లక్షలకు చేరుకోవడంతో ‘ఆపర్చునిటీ టు మ్యాచ్‌’ (ఓటీఎమ్‌) కార్డు ద్వారా కొత్త జట్లయిన ఆకాశ్‌ టైగర్స్, ఈగల్‌ థానే స్ట్రయికర్స్‌లకు అవకాశం దక్కింది. చివరకు ‘డ్రా’ తీయగా టైగర్స్‌ పేరు వచ్చి ంది. అర్జున్‌ టెండూల్కర్‌ ఇదివరకే భారత్‌ అండర్‌–19 జట్టు తరఫున అనధికారిక టెస్టులు ఆడాడు. అన్నట్లు... ఈ లీగ్‌కు సచినే బ్రాండ్‌ అంబాసిడర్‌! 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top