' ఇంకా చర్చల దశలోనే' | Sydney Thunder terms reports of signing Harmanpreet 'premature' | Sakshi
Sakshi News home page

' ఇంకా చర్చల దశలోనే'

Jun 25 2016 4:44 PM | Updated on Sep 4 2017 3:23 AM

' ఇంకా చర్చల దశలోనే'

' ఇంకా చర్చల దశలోనే'

ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్బాష్ లీగ్లో భాగంగా సిడ్నీ థండర్తో భారత క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్తో ఒప్పందం జరిగినట్లు వచ్చిన వార్తలను ఆ ఫ్రాంచైజీ మేనేజర్ నికీ కమిన్స్ ఖండించారు.

సిడ్నీ: మహిళా బిగ్బాష్ లీగ్లో భాగంగా సిడ్నీ థండర్తో భారత క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆ ఫ్రాంచైజీ మేనేజర్ నికీ కమిన్స్ ఖండించారు. ఇంకా సదరు క్రీడాకారిణితో ఎటువంటి ఒప్పందం జరగలేదన్నారు. ప్రస్తుతం ఆమెతో ఒప్పందం అనేది చర్చల దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ' ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాం. అయితే  ఇంకా మా మధ్య చర్చలు తుది దశకు రాలేదు. మా జట్టు తరపున ఆడాలని ఆమెతో చర్చలు సాగుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ' అని కమిన్స్ తెలిపారు.

బిగ్ బాష్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ తో హర్మన్ ప్రీత్ ఒప్పందం చేసుకున్నట్లు శుక్రవారం వార్తలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే.  ఆ లీగ్ కు సంబంధించి మూడు ఫ్రాంచైజీల నుంచి హర్మన్కు ఆఫర్లు రాగా, సిడ్నీ థండర్ వైపే ఆమె మొగ్గు చూపినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ధృవీకరించినట్లు మీడియాలో రావడంతో ఆ ఫ్రాంచైజీ మేనేజర్ తాజాగా వివరణ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement