breaking news
bib bash league
-
Ashleigh Barty: ఈమె ఓ క్రికెటర్ అన్న విషయం తెలుసా..?
లండన్: 41 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టైటిల్ గెలిచిన ఆస్ట్రేలియన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించిన ఆష్లీ బార్టీ.. ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టక ముందు కొంతకాలంపాటు క్రికెట్ ఆడిందన్న విషయం చాలా మందికి తెలీదు. 2011లో జూనియర్ బాలికల వింబుల్డన్ టైటిల్ నెగ్గిన బార్టీ.. 2014లో ఆటపై ఆసక్తి కోల్పోయి రెండేళ్లపాటు టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకుంది. 2015–2016లో బిగ్‌బాష్ మహిళల టీ20 క్రికెట్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టు తరఫున బరిలోకి దిగింది. అయితే క్రికెటర్‌గా అంతగా సఫలం కాకపోవడంతో 2016లో టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. బార్టీ 2015లో క్వీన్స్లాండ్ తరఫున 2 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో కూడా ఆడింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్, మీడియం పేస్ బౌలింగ్ చేసే బార్టీ.. 19 ఏళ్ల వయసులోనే ఆసీస్ అండర్-15 జట్టు కోచ్‌గా కూడా వ్యవహరించింది. 2019లో తొలి గ్రాండ్‌స్లామ్(ఫ్రెంచ్ ఓపెన్) సాధించిన 25 ఏళ్ల బార్టీ.. శనివారం జరిగిన ఫైనల్లో ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై 6–3, 6–7 (4/7), 6–3తో విజయం సాధించి వింబుల్డన్ ఛాంపియన్‌గా అవతరించింది. ఈ క్రమంలో ఆమె పలు ఘనతలను సొంతం చేసుకుంది. వింబుల్టన్‌లో జూనియర్, సీనియర్ మహిళల సింగిల్స్ టైటిల్స్ గెలిచిన నాలుగో క్రీడాకారిణిగా నిలిచింది. గతంలో యాన్ షిర్లే జోన్స్ (బ్రిటన్–1956, 1969), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్–1994, 1997), అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్–1996, 2006) ఈ ఘనత సాధించారు. అలాగే, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ నెగ్గిన మూడో ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు దక్కించుకుంది. గతంలో మార్గరెట్ కోర్ట్ స్మిత్ (1963, 1965, 1970), ఇవోన్ గూలాగాంగ్ (1971, 1980) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
' ఇంకా చర్చల దశలోనే'
సిడ్నీ: మహిళా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్‌తో భారత క్రీడాకారిణి హర్మన్ ప్రీత్ కౌర్ ఒప్పందం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను ఆ ఫ్రాంచైజీ మేనేజర్ నికీ కమిన్స్ ఖండించారు. ఇంకా సదరు క్రీడాకారిణితో ఎటువంటి ఒప్పందం జరగలేదన్నారు. ప్రస్తుతం ఆమెతో ఒప్పందం అనేది చర్చల దశలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. ' ఆల్ రౌండర్ హర్మన్ ప్రీత్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాం. అయితే ఇంకా మా మధ్య చర్చలు తుది దశకు రాలేదు. మా జట్టు తరపున ఆడాలని ఆమెతో చర్చలు సాగుతునే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది ' అని కమిన్స్ తెలిపారు. బిగ్ బాష్ ట్వంటీ 20 ఫ్రాంచైజీ సిడ్నీ థండర్ తో హర్మన్ ప్రీత్ ఒప్పందం చేసుకున్నట్లు శుక్రవారం వార్తలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ లీగ్ కు సంబంధించి మూడు ఫ్రాంచైజీల నుంచి హర్మన్‌కు ఆఫర్లు రాగా, సిడ్నీ థండర్ వైపే ఆమె మొగ్గు చూపినట్లు కథనాలు వచ్చాయి. ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ కూడా ధృవీకరించినట్లు మీడియాలో రావడంతో ఆ ఫ్రాంచైజీ మేనేజర్ తాజాగా వివరణ ఇచ్చారు.