సన్నీత్‌ డబుల్‌ ధమాకా | Sunnit Gets Double Dhamaka | Sakshi
Sakshi News home page

సన్నీత్‌ డబుల్‌ ధమాకా

Apr 1 2019 4:02 PM | Updated on Apr 1 2019 4:02 PM

Sunnit Gets Double Dhamaka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లియో జూనియర్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో సన్నీత్‌ ఉప్పా టి సత్తా చాటాడు. లింగంపల్లిలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో సన్నీత్‌ అండర్‌–14, 16 విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకున్నా రు. ఆదివారం జరిగిన అండర్‌–16 బాలుర ఫైనల్లో సన్నీత్‌ 6–1తో సాకేత రామపై గెలుపొందాడు. బాలికల కేటగిరీలో నవ్య 6–2తో స్ఫూర్తిని ఓడించింది. అండర్‌–14 బాలబాలికల ఫైనల్లో సన్నీత్‌ 6–3తో జైసింహాపై, స్ఫూర్తి 6–0తో నవ్యపై విజయం సాధించారు. అండర్‌–12 కేటగిరీలో పార్థ్, రితిక విజేతలుగా నిలిచారు. ఫైనల్లో పార్థ్‌ 6–3తో సాయి సూర్యపై గెలుపొందగా, రితిక 6–1తో ఎంఆర్‌వీబీ స్ఫూర్తిని ఓడించింది. అండర్‌–10 బాలుర టైటిల్‌పోరులో సాయి సూర్య సంజిత్‌ 6–5 (8–6)తో తారకఅర్జున్‌పై గెలుపొందాడు.

బాలికల తుదిపోరులో మినాల్‌ 6–1తో శ్రీయుక్తను ఓడించింది. మిక్స్‌డ్‌ సింగిల్స్‌లో తనవ్‌ 6–3తో సిద్ధార్థ్‌పై విజయం సాధించాడు. ఫైనల్‌ అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ కోల శ్రీనివాస్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.    

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement