'స్మిత్‌.. నాకు మరిన్ని కాఫీ సెషన్స్‌ కావాలి' | Steve Smith Teaches Kane Williamson How To Improve His Latte Art Skill | Sakshi
Sakshi News home page

'స్మిత్‌.. నాకు మరిన్ని కాఫీ సెషన్స్‌ కావాలి'

May 13 2020 12:51 PM | Updated on May 13 2020 1:58 PM

Steve Smith Teaches Kane Williamson How To Improve His Latte Art Skill - Sakshi

మెల్‌బోర్న్‌ : కరోనా  నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ సీజన్‌ను ఆసీస్‌ ఆటగాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నంతగా ఎవరు చేయడం లేదనే చెప్పాలి. ముఖ్యంగా ఆసీస్‌ విధ్వంసక ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టిక్‌టాక్‌ వీడియోలతో రెచ్చిపోతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమసన్‌కు కాఫీ ఎలా చేయాలనే దానికి సంబంధించిన చిట్కాలు  ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించాడు. అయితే అంతకుముందు కేన్‌ విలియమ్‌సన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాఫీ తయారు చేస్తున్న వీడియో ఒకటి షేకర్‌ చేశాడు. అయితే అది అనుకున్నంత బాగా రాలేదని.. నాకు ఎవరైనా కాఫీ పెట్టడం నేర్పిస్తే బాగుంటుందని పేర్కొన్నాడు.

దీనికి స్మిత్‌ స్పందిస్తూ.. ' ఆల్‌ రైట్‌ కేన్‌.. నేను నీకు సహాయపడతాను. కాఫీ తయారు చేసేటప్పుడు నువ్వు  చేసిన తప్పులు నేను చూశాను. కాఫీ షేప్‌ చక్కగా రావాలంటే దానికి కొన్ని చిట్కాలు అవసరం ఉంది. పాలను క్యాపుచినో పౌడర్‌తో కలిపేటప్పుడు గ్లాస్‌ను సమాంతరంగా పట్టుకోవాలి. క్యాపుచినొకు సమాంతరంగా పాలు కలుపుకుంటే కాఫీ షేప్‌ చక్కగా ఉంటుంది. కాఫీని తయారు చేయడం ఒక ఆర్ట్‌ లాంటిది.. ఇప్పుడు నేను ప్రయత్నించాను.. ఫీడ్‌బ్యాక్‌ ఉంటే పంపు.. కేన్‌ విలియమ్‌సన్‌. అంతేకాదు మనం కాఫీ కంటే క్రికెట్‌ బాళ్లనే ఈజీగా కొట్టగలము' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. దీనికి కేన్‌ విలిమమ్‌సన్‌ స్పందిస్తూ..' హాహాహా బ్రో.. నువ్వు ఆటలోనే కాదు కాఫీ తయారు చేయడంలోనూ జీనియస్‌. నాకు మరిన్ని కాఫీ మేకింగ్‌ సెషన్స్‌ కావాలి స్మిత్‌' అంటూ స్మిత్‌పై ప్రశంసలు కురింపించాడు.

‘బుట్టబొమ్మ’కు కాలు కదిపిన కెవిన్‌..
'నా ఇంటిపై రాళ్లతో దాడి చేశారు'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement