'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే' | Steve Smith credits IPL for success | Sakshi
Sakshi News home page

'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే'

Jan 29 2015 8:23 PM | Updated on Sep 2 2017 8:29 PM

'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే'

'ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే'

ఆస్ట్రేలియాలో ఆ జట్టు క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇప్పుడు పెద్ద హీరోగా మారిపోయాడు.

పెర్త్:  ఆస్ట్రేలియాలో ఆ జట్టు క్రికెట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇప్పుడు పెద్ద హీరోగా  మారిపోయాడు. టీమిండియా తో జరిగిన టెస్ట్ సిరీస్ ముందువరకూ నామమాత్రపు ఆటగాడిగా ఉన్న స్మిత్ అటు ఆటతో ఆకట్టుకుంటూ అవార్డులతో  దూసుకుపోతున్నాడు. టీమిండియాతో జరిగిన సిరీస్ లో అత్యధిక పరుగులు చేసి న్యూ బ్రాడ్ మెన్ ఆఫ్ క్రికెట్ ఆస్ట్రేలియాగా తెరపైకి వచ్చిన అతగాడు.. దానికి కారణం ఐపీఎల్ అంటున్నాడు. ఈ రోజు స్మిత్ ఇలా ఉన్నాడంటే అందుకు కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లే అని తాజాగా స్పష్టం చేశాడు. అక్కడ చాలా విషయాలు నేర్చుకోవడంతోనే తన ఆట శైలి బాగా మెరుగైందన్నాడు.

'నేను ఐపీఎల్  వంటి గొప్ప టోర్నమెంట్ లో భాగస్వామ్యం అయినందుకు సంతోషం. ఇంతటి ఘనత సాధించడానికి ఆ లీగే కారణం. ప్రత్యేకంగా వన్డేల్లో రాణించడానికి ఐపీఎల్ ఎంతో దోహద పడింది. ఆ క్రెడిట్ అంతా ఐపీఎల్ దే' అని స్మిత్ తెలిపాడు. ప్రతీ యంగ్ క్రికెటర్ కు ఐపీఎల్ ఒక గొప్ప లెర్నింగ్ ఎక్సపీరియన్స్ అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement