వావ్రింకా.. వావ్! | Stanislas Wawrinka beats Novak Djokovic to win US Open men's title | Sakshi
Sakshi News home page

వావ్రింకా.. వావ్!

Sep 12 2016 6:44 AM | Updated on Sep 4 2017 1:13 PM

వావ్రింకా.. వావ్!

వావ్రింకా.. వావ్!

స్టానిస్లాస్ వావ్రింకా తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు.

స్విట్జర్లాండ్ టెన్నిస్ ప్లేయర్ స్టానిస్లాస్ వావ్రింకా తొలిసారి యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను గెలుపొందాడు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఫైనల్స్ లో ప్రపంచ నంబర్ వన్ సెర్బియన్ ఆటగాడు నోవాక్ జకోవిచ్ ని వావ్రింకా మట్టికరిపించాడు.

హోరా హోరీగా జరిగిన ఫైనల్లో 6-7(1), 6-4, 7-5, 6-3 సెట్లలో జకోవిచ్ ను ఓడించి టైటిల్ ను దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ కెరీర్లో మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్ ఆడిన వావ్రింకా మూడు టైటిల్స్‌ను గెలుపొందాడు. 2014లో ఆస్ట్రేలియన్ ఓపెన్, 2015లో ఫ్రెంచ్ ఓపెన్ లలో వావ్రింకా విజేతగా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement