సెయింట్‌ మార్టిన్స్‌ జట్టుకు టైటిల్‌ | St Martins Team gets Football Title | Sakshi
Sakshi News home page

సెయింట్‌ మార్టిన్స్‌ జట్టుకు టైటిల్‌

Mar 29 2018 10:50 AM | Updated on Oct 2 2018 8:39 PM

St Martins Team gets Football Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్‌టీయూహెచ్‌ సెంట్రల్‌ జోన్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో సెయింట్‌ మార్టిన్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజి విజేతగా నిలిచింది. సీఎంఆర్‌ కాలేజి ప్రాంగణంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సెయింట్‌ మార్టిన్స్‌ 1–0తో ఆతిథ్య సీఎంఆర్‌ జట్టుపైనే విజయం సాధించింది.

మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను కైలాష్‌శర్మ సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో సెయింట్‌ మార్టిన్స్‌ 4–1తో బీవీఆర్‌ఐటీపై గెలుపొందింది. విజేత జట్టు చేసిన నాలుగు గోల్స్‌నూ కెప్టెన్‌ శరత్‌చంద్ర సాధించడం విశేషం. మరో సెమీస్‌లో సీఎంఆర్‌ 1–0తో వీఎన్‌ఆర్‌ వీజేఐఈటీపై గెలుపొంది ఫైనల్‌ చేరింది.

 

Advertisement
 
Advertisement
Advertisement