సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika enters semis of ITF tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక

Nov 10 2017 10:41 AM | Updated on Nov 10 2017 10:42 AM

Srivalli Rashmika enters semis of ITF tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. దుబాయ్‌లోని ఏవియేషన్‌ క్లబ్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్‌) 6–2, 6–4తో ముస్కాన్‌గుప్తా (భారత్‌)పై గెలుపొందింది.

పాంజల, నిధి ఓటమి

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల పోరాటం ముగిసింది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరిద్దరూ డబుల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌లో వెనుదిరిగారు. మహిళల డబుల్స్‌ తొలి క్వార్టర్స్‌ మ్యాచ్‌లో రుతుజా భోస్లే– ప్రాంజల (భారత్‌) ద్వయం 5–7, 5–7తో మూడో సీడ్‌ లీ చి పెయ్‌ (చైనీస్‌ తైపీ)– యానా సిజికోవా (రష్యా) జంట చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో నిధి– ప్రేరణ బాంబ్రీ (భారత్‌) జంట 6–4, 5–7, 2–10తో జీల్‌ దేశాయ్‌ (భారత్‌)– బున్వాయి థాంచవత్‌ (థాయ్‌లాండ్‌) జోడీ చేతిలో పరాజయాన్ని చవిచూసింది.

Advertisement
 
Advertisement
Advertisement