సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక | Srivalli Rashmika Enters Semis of ITF Tourney | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శ్రీవల్లి రష్మిక

Dec 7 2018 9:44 AM | Updated on Dec 7 2018 9:44 AM

Srivalli Rashmika Enters Semis of ITF Tourney - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీవల్లి రష్మిక నిలకడగా రాణిస్తోంది. పుణేలో జరుగుతోన్న ఈ టోర్నీలో రష్మిక సెమీఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో రష్మిక 6–0, 7–6 (1)తో టాప్‌ సీడ్‌ శివాని అమినేనిపై వరుస సెట్లలో విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌కు చెందిన జటవపోర్నవీత్‌ పిమ్రద (ఐదో సీడ్‌)తో రష్మిక తలపడుతుంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement