సుప్రీం కోర్టులో శ్రీనివాసన్కు ఊరట | Srinivasan continues as BCCI President: Supreme Court | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో శ్రీనివాసన్కు ఊరట

Sep 30 2013 2:53 PM | Updated on Sep 1 2017 11:12 PM

సుప్రీం కోర్టులో శ్రీనివాసన్కు ఊరట

సుప్రీం కోర్టులో శ్రీనివాసన్కు ఊరట

బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చింది.

బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన ఎన్.శ్రీనివాసన్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. బోర్డు అధ్యక్షుడిగా ఆయన కొనసాగేందుకు కోర్టు అనుమతిచ్చింది. ఐతే ఐపీఎల్కు సంబంధించిన విషయాలపై జోక్యం చేసుకోరాదని ఆదేశించింది.

శ్రీనివాసన్కు వ్యతిరేకంగా బీహార్ క్రికెట్ సంఘం దాఖలు చేసిన పిటీషన్ను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ రాకెట్లో శ్రీని అల్లుడు గురునాథ్ మేయప్పన్పై ఆరోపణలు రావడంతో ఆయన్ను బోర్డు పదవులకు దూరంగా ఉంచాలని కోర్టును బీహార్ సంఘం విన్నవించింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
 
Advertisement
Advertisement