చెమటోడుస్తున్న బౌలర్లు! | srilanka solid start against india in first one day | Sakshi
Sakshi News home page

చెమటోడుస్తున్న బౌలర్లు!

Aug 20 2017 4:04 PM | Updated on Nov 9 2018 6:43 PM

చెమటోడుస్తున్న బౌలర్లు! - Sakshi

చెమటోడుస్తున్న బౌలర్లు!

శ్రీలంకతో్ జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు.

దంబుల్లా: శ్రీలంకతో్ జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ సేన.. లంక బ్యాట్స్మెన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు.  20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి భారత బౌలింగ్ లైనప్ కు పరీక్షగా నిలిచింది. తొలి వికెట్ ను తీయడానికి భారత్ కు 14 ఓవర్లు అవరసమైంది.

ఓపెనర్ గుణతిలకా(35) తొలి వికెట్ గా చాహల్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ 14 ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. ఆపై  మరో ఓపెనర్ డిక్ వెల్లాకు కుశాల్ మెండిస్ జత కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు శుభారంభం లభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి చక్కటి పునాది వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement