బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది | Sri lanka win by seven wickets in Champion Trophy | Sakshi
Sakshi News home page

బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది

Jun 8 2017 11:38 PM | Updated on Sep 5 2017 1:07 PM

బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది

బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది

ఛాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ గురువారం శ్రీలంకతో జరిగినా మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి ఓడిపోయింది.

ఛాంపియన్‌ ట్రోఫిలో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ-శిఖర్‌ ధావన్‌లు బ్యాట్‌తో మెరిశారు. ధావన్‌ 125 పరుగులు, 128 బంతుల్లో చేశాడు.

322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్‌ డిక్వెల్(7) వికెట్‌ను కోల్పోయింది. కుశాల్‌ మెండీస్‌(89), గుణతిలకలు(76)లు నిలకడగా ఆడి  విజయంవైపు అడుగులు పడేలా చేశారు. టీమ్‌ ఇండియాకు బలం అనుకున్న బౌలింగ్‌ విఫలం​ చెందడంతోతో మ్యాచ్‌ చేయి జారిపోయింది. ఏడు వికెట్ల తేడాతో లంకేయులు ఇండియాపై విజయం సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement