వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం | South Africa take series | Sakshi
Sakshi News home page

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం

Mar 5 2017 1:11 AM | Updated on Apr 4 2019 5:21 PM

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం - Sakshi

వన్డే సిరీస్‌ దక్షిణాఫ్రికా వశం

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3–2తో కైవసం చేసుకుంది.

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3–2తో కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన చివరిదైన ఐదో వన్డేలో సఫారీ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 41.1 ఓవర్లలో 149 పరుగులకే కుప్పకూలింది. డి గ్రాండ్‌హోమ్‌ (32) టాప్‌ స్కోరర్‌. సఫారీ బౌలర్లలో రబడ 3, ఇమ్రాన్‌ తాహిర్, ఫెలుక్వయో చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత దక్షిణాఫ్రికా 32.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి గెలిచింది.

డు ప్లెసిస్‌ (51 నాటౌట్‌; 6 ఫోర్లు), మిల్లర్‌ (45 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌ బుధవారం డునెడిన్‌లో మొదలవుతుంది. తాజా విజయంతో సఫారీ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంకును నిలబెట్టుకుంది. దక్షిణాఫ్రికా 119 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా... ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. కివీస్‌తో చివరి మ్యాచ్‌లో ఓడిపోయివుంటే దక్షిణాఫ్రికా ఒక పాయింట్‌ కోల్పోయి ఆసీస్‌తో సమంగా నిలిచేది. అప్పుడు ఆస్ట్రేలియా డెసిమల్‌ పాయింట్ల తేడాతో అగ్రస్థానంలో నిలిచేది. 

Advertisement
 
Advertisement
Advertisement