‘సారీ బ్రదర్‌.. ఆ విషయంపై మాట్లాడను’

Sourav Ganguly Says Cant comment on BCCI Central Contracts - Sakshi

టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌, జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఎంఎస్‌ ధోనికి వార్షిక కాంట్రాక్ట్‌ జాబితాలో బీసీసీఐ అవకాశం కల్పించని విషయం తెలిసిందే. దీంతో ధోని కెరీర్‌ ముగిసిందని ఓ వర్గం సింపుల్‌గా పేర్కొంటుండగా.. మరో వర్గం మాత్రం బీసీసీఐపై దుమ్మెత్తిపోస్తోంది. మూడు ఐసీసీ టోర్నీలను అందించిన ఓ దిగ్గజ సారథి​కి ఇచ్చే కనీస గౌరవం ఇదేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ విషయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాలని పలువురు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఓ సమావేశానికి హాజరైన దాదాను ధోని విషయంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ విషయంపై సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశాడు. చివరికి ఈ అంశంపై తాను మాట్లాడను అంటూ స్పష్టం చేశాడు. 

దీంతో ధోనిని సాగనంపడానికి బ్యాకెండ్‌లో బాగానే వర్క్‌ జరిగనట్టుందని క్రీడా విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్‌లో ధోని ప్రదర్శన ఆధారంగానే టీమిండియా తరుపున ఆడతాడా లేదా అనే తేటతెల్లమవుతుందని అంటున్నారు. ఇక టీమిండియాలోకి రావడానికి ధోనికి ఐపీఎల్‌ ఓ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను హ​ర్భజన్‌ కొట్టిపారేశాడు. ఐపీఎల్‌లో ధోని అద్భుతంగా ఆడటం పక్కా అని ఎందుకంటే తాను ఆగే ప్రతీ మ్యాచ్‌లో వంద శాతం ప్రదర్శన చేయాలనుకుంటాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. అయితే ఐపీఎల్‌లో ఆడినంత మాత్రాన టీమిండియాలో చోటు దక్కుతుందనే నమ్మకం లేదన్నాడు.

చదవండి: 
ధోని చివరి మ్యాచ్‌ ఆడేశాడా? ​
‘నో’ కాంట్రాక్ట్‌ ‘లో’ కాంట్రాక్ట్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top