
కీలక ఆటగాళ్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియాను ఓడించేందుకు భారత్‌కు మంచి అవకాశం వచ్చిందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ లేని ఆసీస్... విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేని భారత్ వంటిదని పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్‌కు ఇదో గొప్ప సందర్భం. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఓడించేందుకు చక్కటి అవకాశం. అయినా, జాగ్రత్తగా ఉండాల్సిందే. అందరూ అంటున్నట్లు ఆ జట్టు మరీ బలహీనంగా ఏమీ లేదు’ అని విశ్లేషించాడు.