
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ వరల్డ్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాడు సౌరభ్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌరభ్ 21–13, 21–18తో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)పై విజయం సాధించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ 112వ ర్యాంకర్ మినోరు కొగా (జపాన్)తో సౌరభ్ తలపడతాడు.