వార్నర్, స్మిత్‌ పునరాగమనం

Smith, Warner return for Australia World Cup - Sakshi

ప్రపంచకప్‌లో పాల్గొనే  ఆస్ట్రేలియా జట్టులో చోటు

సిడ్నీ: బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతం కారణంగా సంవత్సర కాలం నిషేధాన్ని ఎదుర్కొన్న ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్లు స్టీవ్‌ స్మిత్, డేవిడ్‌ వార్నర్‌లకు గొప్ప అవకాశం దక్కింది. మే 30 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టులో వీరిద్దరూ చోటు దక్కించుకున్నారు. ఇటీవల పాకిస్తాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ చివరి రెండు మ్యాచ్‌ల నాటికే వీరిద్దరిపై నిషేధం ముగిసింది.

అయినప్పటికీ సెలక్టర్లు వీరిని జాతీయ జట్టుకు ఎంపిక చేయకుండా... ఐపీఎల్‌లో ఆడాలని సూచించారు. మరోవైపు పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్, జోష్‌ హాజల్‌వుడ్‌లకు ఆసీస్‌ జట్టులో చోటు దక్కలేదు. 
ఆసీస్‌ ప్రపంచ కప్‌ జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), ఖాజా, వార్నర్, స్మిత్, షాన్‌ మార్‌‡్ష, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కమిన్స్, మిచెల్‌ స్టార్క్, రిచర్డ్సన్, కూల్టర్‌ నీల్, బెహ్రెన్‌డార్ఫ్, నాథన్‌ లయన్, ఆడమ్‌ జంపా.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top