థాయ్‌లాండ్‌ బాక్సింగ్‌ టోర్నీకి శ్యామ్, హుస్సాముద్దీన్‌

థాయ్‌లాండ్‌ బాక్సింగ్‌ టోర్నీకి శ్యామ్, హుస్సాముద్దీన్‌


న్యూఢిల్లీ: వచ్చే నెలలో థాయ్‌లాండ్‌లో జరిగే అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్‌ కుమార్, తెలంగాణకు చెందిన మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌లకు చోటు లభించింది. ఏప్రిల్‌ 1 నుంచి 7 వరకు బ్యాంకాక్‌లో జరిగే ఈ టోర్నీలో ఏడు వెయిట్‌ కేటగిరీలలో బౌట్‌లు ఉంటాయి. ఒలింపియన్‌ బాక్సర్లు దేవేంద్రో సింగ్, శివ థాపా, మనోజ్‌ కుమార్, వికాస్‌ కృషన్‌లు కూడా ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. గతంలో ‘కింగ్స్‌ కప్‌’గా వ్యవహరించిన ఈ టోర్నీలో 2015లో శ్యామ్‌ కుమార్‌ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇటీవలే బల్గేరియాలో ముగిసిన స్ట్రాండ్‌జా కప్‌లో హుస్సాముద్దీన్‌ రజత పతకాన్ని గెలిచాడు.వీసాలు రాకపోవడంతో...

మరోవైపు ఈనెల 13 నుంచి 18 వరకు జర్మనీలో జరిగే కెమిస్ట్రీ కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీకి భారత బాక్సర్లు వెళ్లడం లేదు. నిర్ణీత సమయానికి వీసాలు రాకపోవడంతో ఈ టోర్నీకి భారత బాక్సర్లు దూరమయ్యారు.భారత బాక్సింగ్‌ జట్టు: కాకర శ్యామ్‌ కుమార్‌ (49 కేజీలు), దేవేంద్రో సింగ్‌ (52 కేజీలు), మొహమ్మద్‌ హుస్సాముద్దీన్‌ (56 కేజీలు), శివ థాపా (60 కేజీలు), రోహిత్‌ టొకాస్‌ (64 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు), వికాస్‌ కృషన్‌ (75 కేజీలు).

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top