'పద్మభూషణ్'కు సింధు | Shutter pv sindhu recommended for padma Bhushan by sports ministry | Sakshi
Sakshi News home page

'పద్మభూషణ్'కు సింధు

Sep 25 2017 11:26 AM | Updated on Sep 25 2017 4:11 PM

Shutter pv sindhu recommended for padma Bhushan by sports ministry

న్యూఢిల్లీ: దేశ మూడో అత్యున్నత పురస్కారం 'పద్మభూషణ్' కోసం భారత స్టార్ షట్లర్ పివి సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ సిఫారుసు చేసింది. ఈ మేరకు సోమవారం ఆమెను పద్మభూషణ్ అవార్డు కోసం నామినేట్ చేసింది.ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో రజత పతకం సాధించిన సింధు.. ఆపై కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్ ను కూడా కైవసం చేసుకున్నారు. అంతకుముందు రియో ఒలింపిక్స్ లో పివి సింధు రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి పద్మ పురస్కారాల్లో భాగంగా పద్మభూషణ్ కు సింధు పేరును క్రీడా శాఖ ప్రతిపాదించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement