'ఆరోజు హర్భజన్‌ను కొట్టడానికి రూమ్‌కు వెళ్లా'

Shoaib Akhtar On Altercation During India Vs Pakistan Match In Asia Cup Final - Sakshi

కరాచి : సరిగ్గా పదేళ్ల క్రితం 2010 మార్చిలో శ్రీలంక వేదికగా ఆసియాకప్‌ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడింది. హోరాహోరీగా జరిగిన ఈ ఫైనల్లో టీమిండియా ఆఖరి ఓవర్లో 2 బంతుల్లో మూడు పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో హర్భజన్‌, ప్రవీణ్‌ కుమార్‌లు ఉన్నారు. మహ్మద్‌ ఆమిర్‌ వేసిన ఐదో బంతిని భజ్జీ సిక్స్‌గా మలచి జట్టును గెలిపించాడు. అంతే భజ్జీ ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ నాన్‌ స్ర్టైకింగ్‌లో ఉన్న ప్రవీణ్‌ కుమార్‌ను గట్టిగా హత్తుకున్నాడు. అయితే మ్యాచ్‌లో 47వ ఓవర్‌ పాక్‌ స్పీడష్టర్‌ షోయబ్‌ అక్తర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో హర్భజన్‌ మొదటి బంతినే సిక్స్‌గా మలచడంతో అక్తర్‌ కోపంతో మిగతా బంతులన్నీ భజ్జీ భుజాన్ని టార్గట్‌ చేస్తూ పదునైన బౌన్సర్లు సంధించాడు. అంతేగాక అక్తర్‌, భజ్జీల మధ్య మ్యాచ్‌ చివరి వరకు మాటల యుద్దం కూడా నడిచింది. ఆ కోపమే భజ్జీని ఆమిర్‌ ఓవర్లో సిక్స్‌ కొట్టి భారత్‌ను కప్‌ అందుకునేలా చేసింది. ఇది క్లుప్తంగా అక్కడ జరిగిన సన్నివేశం.
('ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి')

తాజాగా దీనిపై షోయబ్‌ అక్తర్‌ హలో యాప్‌కు ఇంటర్య్వూ ఇస్తూ మరోసారి స్పందించాడు.'(నవ్వుతూ) ఆరోజు మ్యాచ్‌ ముగియగానే హర్భజన్‌ ఉన్న హోటల్‌ రూంకు వెళ్లి అతన్ని కొట్టాలనుకున్నా. స్వతహగా మంచివాడైన భజ్జీ పాక్‌కు వచ్చినప్పుడు మాతో పాటు లాహోర్‌ మొత్తం కలియ తిరిగాడు. ఎన్నో సార్లు మాతో కలిసి భోజనం కూడా చేశాడు. అలాంటి పంజాబీ బ్రదర్‌ నాతో ఎలా మిస్‌బిహేవ్‌ చేశాడనే కోపం వచ్చింది. దీంతో అతని రూంకెళ్లి కొట్టాలనుకున్న.. కానీ నేను వస్తున్నట్లు ముందే తెలుసుకున్న భజ్జీ అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఎంత వెతికినా కనిపించలేదు. మరుసటి రోజు నన్ను కలిశాడు. ఇద్దరం క్షమాపణలు కూడా చెప్పుకున్నాం' అంటూ పేర్కొన్నాడు. ఇదే విషయమై హర్భజన్‌ కూడా గతంలో పలుమార్లు వివరించాడు.
(స్టీవ్‌ వా మోస్ట్‌ సెల్ఫిష్‌: వార్న్)‌
('సందేహం లేదు.. జడ్డూనే అత్యుత్తమ ఫీల్డర్‌')

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top