టీఎస్‌టీఏ టోర్నీ డైరెక్టర్‌గా శివకుమార్‌ | Shiva Kumar elected as TSTA Director | Sakshi
Sakshi News home page

టీఎస్‌టీఏ టోర్నీ డైరెక్టర్‌గా శివకుమార్‌

Jul 3 2018 10:25 AM | Updated on Jul 3 2018 10:25 AM

Shiva Kumar elected as TSTA Director - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌ సంఘం (టీఎస్‌టీఏ) టోర్నమెంట్స్‌ డైరెక్టర్‌గా జె. శివకుమార్‌రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి టోర్నీల నిర్వహణలో అపార అనుభవం కలిగిన రిఫరీ శివకుమార్‌ను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు టీఎస్‌టీఏ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో శివకుమార్‌ మినహా అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) అధికారిక గుర్తింపును పొందిన రిఫరీలు లేకపోవడం విశేషం. 2005 నుంచి టీఎస్‌టీఏ నిర్వహించే పలు టోర్నీలను ఆయన పర్యవేక్షించారు.  

Advertisement
 
Advertisement
Advertisement