
న్యూఢిల్లీ : స్వదేశంలో విండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ సందర్భంగా మహారాష్ట్రతో మ్యాచ్‌లో జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఎడమ మోకాలికి గాయమైంది. కాగా అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో ధావన్ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం పట్టే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. కాగా అతని స్థానంలో కేరళ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.
2015లో జింబాబ్వేపై ఒక టీ20 ఆడిన సంజా శామ్సన్ ఆ మ్యాచ్‌లో 19 పరుగులు చేశాడు. అప్పటి నుంచి మళ్లీ ఒక్క మ్యాచ్‌లో ఆడలేదు. బంగ్లాతో జరిగిన టీ20 సిరీస్‌కు ఎంపికైనా అదనపు ఆటగాడిగా ఉన్నాడు తప్ప తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కాగా ఇటు దేశవాలి టోర్నమెంట్లు , అటు ఐపీఎల్‌లో మాత్రం సంజు శాంసన్ మంచి ప్రదర్శనను నమోదు చేశాడు. డిసెంబరు 6 నుంచి విండీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరగనుంది.