మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం | Shardul Thakur replaces injured Bhuvneshwar | Sakshi
Sakshi News home page

మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం

Oct 6 2016 1:16 PM | Updated on Sep 4 2017 4:25 PM

మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం

మూడో టెస్టుకు భువనేశ్వర్ దూరం

న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగనున్న మూడో టెస్టుకు భారత ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు.

ఇండోర్: న్యూజిలాండ్ తో ఇండోర్ లో జరుగనున్న మూడో టెస్టుకు భారత ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ దూరమయ్యాడు. కోల్ కతా లో ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డ భువనేశ్వర్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండటం లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తాజా ప్రకటనలో వెల్లడించింది. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఇప్పటికే ఇషాంత్ శర్మ టెస్టు సిరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇషాంత్ కు చికెన్ గున్యా సోకడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు భువీ కూడా మూడో టెస్టుకు దూరం కావడంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న భావిస్తున్న భారత జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

గత టెస్టు మ్యాచ్ లో ఆరు వికెట్లు సాధించి జట్టు విజయంలో భువనేశ్వర్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లతో కివీస్ వెన్నువిరిచిన భువీ.. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు ఈనెల 8వ తేదీ నుంచి జరుగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement