సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేసిన బంగ్లా క్రికెటర్‌

Shakib Al Hasan Breaks Sachin Tendulkar World Cup Record - Sakshi

లండన్‌ : క్రికెట్‌ దిగ్గజం, టీమిండియా క్రికెటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ పేరిట 16 ఏళ్లపాటు పదిలంగా ఉన్న రికార్డు బ్రేక్‌ అయింది. 2003 ప్రపంచకప్‌లో లీగ్‌ స్టేజ్‌ పూర్తయ్యేవరకు సచిన్‌ చేసిన 586 పరుగులను బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ అధిగమించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో (77 బంతుల్లో 64; 6 ఫోర్లు) అర్థసెంచరీతో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో 600కు పైగా పరుగులు చేసిన మూడో ఆటగాడిగా షకీబ్‌ గుర్తింపు పొందాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్‌ 673 పరుగులు చేయగా..మాథ్యూ హెడెన్‌ 2003లో 659 పరుగులు చేశాడు. ఈ ఇద్దరి తర్వాత షకీబే తాజా ప్రపంచకప్‌లో 606 పరుగులు సాధించాడు.

ఇక సచిన్‌ పేరిట ఉన్న 673 పరుగుల రికార్డు మాత్రం ఇంతవరకు చెక్కుచెదరలేదు. ఈ ఘనతను అధిగమించే అవకాశం భారత హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కే ఉంది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ 544 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉండగా.. వార్నర్‌ 516 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక పాకిస్తాన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 94 పరుగులతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top