పిల్లా.. నా బావనిస్త! | Sergio Romero’s wife ready to loan him if Argentina win World Cup | Sakshi
Sakshi News home page

పిల్లా.. నా బావనిస్త!

Jul 13 2014 1:24 AM | Updated on Oct 22 2018 5:58 PM

పిల్లా.. నా బావనిస్త! - Sakshi

పిల్లా.. నా బావనిస్త!

ఇది అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరో భార్య ఎలియానా గెర్సియో.. అమెరికా పాప్‌సింగర్ రిహన్నాకు ఇస్తున్న బంపర్ ఆఫర్! అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిస్తే..

రియో డి జనీరో: ఇది అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరో భార్య ఎలియానా గెర్సియో.. అమెరికా పాప్‌సింగర్ రిహన్నాకు ఇస్తున్న బంపర్ ఆఫర్!  అర్జెంటీనా ప్రపంచకప్ విజేతగా నిలిస్తే.. తన భర్త రొమెరోను రిహన్నాకు వారం రోజులపాటు అరువిస్తానని ప్రకటించేసింది ఎలియానా.
 
  విషయమేంటంటే.. నెదర్లాండ్స్‌తో షూటౌట్‌కు దారితీసిన సెమీఫైనల్లో రొమెరో అద్భుత రీతిలో రెండు గోల్స్‌ను అడ్డుకొని అర్జెంటీనాను గెలిపించిన తీరుకు పాప్‌సింగర్ రిహన్నా ముచ్చటపడిపోయింది. రొమరోను మెచ్చుకుంటూ ట్విట్టర్‌లో అనేక పోస్ట్‌లు పెట్టింది. వీటికి ఎలియానా స్పందించింది. మరి అర్జెంటీనా గెలిస్తే తన మాట నిలబెట్టుకుంటుందో... లేక అమ్మో నా బావనిస్తనా! అంటుందో చూడాలి.
 

Advertisement
 
Advertisement
Advertisement