వారెవ్వా సెరెనా...

Serena Williams With Her Daughter at Fashion Week - Sakshi

ఓటమిని అధిగమించి... హొయలొలికించి...

న్యూయార్క్‌: ఎంత పెద్ద ప్రొఫెషనల్‌ ప్లేయర్‌కైనా టైటిల్‌ మెట్టుపై పరాజయమనేది మనసుకు భారంగానే ఉంటుంది. అది కూడా రికార్డు విజయానికి చేరువై ఆఖరికి దూరమవడం రోజుల తరబడి బాధించే అంశం. అందరు దీన్ని జీరి్ణంచుకోలేరేమో కానీ సెరెనా మాత్రం అందరిలాంటి ప్రొఫెషనల్‌ కాదు. ఎందుకంటే సొంతగడ్డపై... ఆఖరిమెట్టుపై... యూఎస్‌ ఓపెన్‌ను చేజార్చుకున్న ఈ నల్లకలువ మూడంటే మూడు రోజుల్లోనే తన వ్యాపారపనుల్లో బిజీబిజీ అయ్యింది.

ఓటమి ఛాయలే లేని ఆమె ర్యాంప్‌ దగ్గర తన కుమార్తెతో కలిసి హొయలొలికించింది. ఆమె ఇదివరకే ‘ఎస్‌’ బై సెరెనా విలియమ్స్‌ అనే బ్రాండింగ్‌తో ఫ్యాషన్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మంగళవారం రాత్రి తన బ్రాండ్‌తో డిజైన్‌ అయిన దుస్తుల ప్రచార కార్యక్రమంలో సెరెనా ఉత్సాహంగా పాల్గొంది. తన గారాలపట్టి ఒలింపియాతో కలిసి సందడి చేసింది. పలువురు మోడల్స్‌లో ‘ఎస్‌’ బ్రాండ్‌ దుస్తులతో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌ చేశారు. అలాగే సెరెనా ఫుల్‌లెంత్‌ గౌన్‌తో తన కుమార్తెను పరిచయం చేసిన వీడియో సోషల్‌ మీడియాలో భలేగా వైరల్‌ అయ్యింది. ఆ దృశ్యం చూసిన వారికి ఆ్రస్టేలియాకు చెందిన ‘కంగారూ’ గుర్తురాక మానదు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top