సెహ్వాగ్ డకౌట్ | Sehwag dock out | Sakshi
Sakshi News home page

సెహ్వాగ్ డకౌట్

Apr 10 2015 10:12 PM | Updated on Sep 3 2017 12:07 AM

రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.

పుణే: ఐపీఎల్-8లో భాగంగా శుక్రవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 163 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. పరుగులేమీ చేయకుండానే తొలి వికెట్ కోల్పోయింది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డకౌటయ్యాడు. సౌతీ బౌలింగ్ లో కీపర్ శామ్సన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

32 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. వృద్ధిమాన్ సాహా(7) రనౌటయ్యాడు. పంజాబ్ 4 ఓవర్లలో 39/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. మురళీ విజయ్(25), మ్యాక్స్ వెల్(5)  క్రీజ్ లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement