ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు టైటిల్ రేసులో నిలిచాయి. అయితే ఈ టోర్నీలో ఆయా జట్ల విజయానికి కారణాలేంటి ? ఈ ప్రశ్నకు ఆటగాళ్ల నుంచి వచ్చే సమాధానం ‘శృంగారం’.
బ్రెజీలియా: ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకుంది. ఎనిమిది జట్లు టైటిల్ రేసులో నిలిచాయి. అయితే ఈ టోర్నీలో ఆయా జట్ల విజయానికి కారణాలేంటి ? ఈ ప్రశ్నకు ఆటగాళ్ల నుంచి వచ్చే సమాధానం ‘శృంగారం’. ఆటకు, శృంగారానికి సంబంధం ఏంటనే అనుమానం రావొచ్చు. కానీ ఈ రెండింటికి సంబంధం ఉందని ఫిఫా ప్రపంచకప్ నిరూపించింది. ఆటగాళ్లు సెక్స్ చేయకుండా నిషేధం విధించిన జట్లు ఈ ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టాయి. రష్యా, మెక్సికో, చిలీ, బోస్నియాతో పాటు ఇప్పటిదాకా చిత్తయిన జట్లు ఇదే కోవలోకి వస్తాయి.
అదే సమయంలో ‘శృంగారం’ విషయంలో ప్లేయర్లపై ఆంక్షలు విధించని జట్ల ఆటగాళ్లు మైదానంలో రెట్టించిన ఉత్సాహంతో చెలరేగిపోతున్నారు. ఆతిథ్య బ్రెజిల్‌తో పాటు జర్మనీ, నెదర్లాండ్స్, కోస్టారికా జట్ల విజయ రహస్యం సెక్సేనని చాలామంది నమ్ముతున్నారు. మ్యాచ్‌కి మ్యాచ్‌కి మధ్య విరామం వచ్చినప్పుడు ఆటగాళ్లను తమ భార్యలతో కానీ, గర్ల్‌ఫ్రెండ్స్‌తో కానీ గడిపేందుకు కోచ్‌లు అనుమతిస్తున్నారు. జర్మనీ, నెదర్లాండ్స్ కోచ్‌లు ‘గో ఎహెడ్’ అని ప్రోత్సహిస్తున్నారట.
ఫలితంగా ఆటగాళ్లు మరో ఆలోచన లేకుండా ఆటపైనే ఎక్కువగా దృష్టిపెడుతున్నారట. ఫ్రాన్స్, బ్రెజిల్, కోస్టారికా జట్ల కోచ్‌లు పరిమిత ఆంక్షలతో కూడిన శృంగారానికి అనుమతిస్తున్నారట. అయితే ఈ జట్ల ఆటగాళ్లు మాత్రం ఆంక్షలున్నా.. లక్ష్యం పూర్తవుతోందని తెగ సంబరపడిపోతున్నారు. ఇక అమెరికా, స్విట్జర్లాండ్, ఉరుగ్వే, నైజీరియా కోచ్‌లు సెక్స్‌కు అనుమతిస్తూనే సవాలక్ష ఆంక్షలు పెట్టారట. ఇది తమపై తీవ్ర ప్రభావం చూపిందని వీళ్లు గుసగుసలాడుకున్నారు. అన్నట్టు... డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ గ్రూప్ దశలోనే వెనుదిరగడానికి కారణం ఆ జట్టు ఆటగాళ్లను శృంగారానికి దూరంగా ఉంచడమేనని ప్రచారం నడుస్తోంది.