సాకేత్‌–అర్జున్‌ జంట ఓటమి | On the second day Indian players got mixed results | Sakshi
Sakshi News home page

సాకేత్‌–అర్జున్‌ జంట ఓటమి

Feb 6 2019 2:27 AM | Updated on Feb 6 2019 2:27 AM

On the second day Indian players got mixed results - Sakshi

చెన్నై: ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో రెండో రోజు భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల డబుల్స్‌లో సాకేత్‌ మైనేని–అర్జున్‌ ఖడే... అనిరుధ్‌ చంద్రశేఖర్‌–అభినవ్‌ జోడీలు తొలి రౌండ్‌లోనే నిష్క్రమించాయి. మూడో సీడ్‌ సాకేత్‌–అర్జున్‌ ద్వయం 6–7 (4/7), 3–6తో గియా న్లుకా మాగెర్‌–ఆండ్రీ పెలెగ్రిని (ఇటలీ) జోడీ చేతిలో ఓడిపోయింది.

77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జంట ఐదు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. మరో మ్యాచ్‌లో అనిరుధ్‌–అభినవ్‌ జంట 7–6 (7/5), 2–6, 5–10తో సిద్ధార్థ్‌ రావత్‌–మనీశ్‌ (భారత్‌) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో శశికుమార్‌ ముకుంద్‌ (భారత్‌) 6–3, 6–1తో సెబాస్టియన్‌ ఫాన్సెలు (జర్మనీ)పై గెలుపొందగా... సుమీత్‌ నాగల్‌ (భారత్‌) 3–6, 4–6తో డకీ లీ (కొరియా) చేతిలో ఓడిపోయాడు.   

Advertisement
 
Advertisement
Advertisement