వెటెల్‌కే టైటిల్‌ | Sebastian Vettel pips Lewis Hamilton to win Bahrain Grand Prix | Sakshi
Sakshi News home page

వెటెల్‌కే టైటిల్‌

Apr 9 2018 4:29 AM | Updated on Aug 1 2018 4:17 PM

Sebastian Vettel pips Lewis Hamilton to win Bahrain Grand Prix - Sakshi

సెబాస్టియన్‌ వెటెల్‌

సాఖిర్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో మాజీ చాంపియన్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఫెరారీ డ్రైవర్‌ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్‌ గంటా 32 నిమిషాల 01.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో... హామిల్టన్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్‌ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్‌ పదో స్థానంలో, పెరెజ్‌ 12వ స్థానంలో నిలిచారు. సీజన్‌ తొలి రేసు ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement