Australian grand prix
-
వారెవ్వా నోరిస్...
మెల్బోర్న్: గత సీజన్‌ను విజయంతో ముగించిన మెక్లారెన్ జట్టు డ్రైవర్ లాండో నోరిస్ కొత్త సీజన్‌ను కూడా విజయంతో ప్రారంభించాడు. 2025 ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల లాండో నోరిస్ చాంపియన్‌గా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నోరిస్ నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 42 నిమిషాల 06.304 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ టైటిల్ సాధిస్తున్న వెర్స్టాపెన్ రెండో స్థానంలో నిలిచాడు. వెర్స్టాపెన్ రేసును 1 గంట 42 నిమిషాల 07.199 సెకన్లలో ముగించాడు. మెర్సిడెస్ డ్రైవర్ జార్జి రసెల్ మూడో స్థానాన్ని పొందాడు. 1987లో ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి మొదలుకాగా ఈ రేసుకంటే ముందు వరకు ఫెరారీ జట్టు డ్రైవర్లు అత్యధికంగా 11 సార్లు విజేతగా నిలిచారు. అయితే ఈసారి ఫెరారీ జట్టుకు ఈ రేసు కలిసిరాలేదు. తొలిసారి ఫెరారీ జట్టు తరఫున బరిలోకి దిగిన మాజీ వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 10వ స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ 8వ స్థానాన్ని సంపాదించాడు. 2010 తర్వాత తొలిసారి ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రికి వర్షం అంతరాయం కలిగించింది. వాన కారణంగా ఈ రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. మూడుసార్లు ట్రాక్‌పై సేఫ్టీ కార్లు వచ్చాయి. తొలి ల్యాప్ పూర్తికాకముందే ముగ్గురు డ్రైవర్లు కార్లోస్ సెయింజ్ (విలియమ్స్), జాక్ దూహాన్ (ఆలై్పన్), ఐజాక్ హద్జార్ (రేసింగ్ బుల్స్) రేసు నుంచి వైదొలిగారు. ఫార్మేషన్ ల్యాప్‌లో హద్జార్ తప్పుకోగా... తొలి ల్యాప్‌లో పరస్పరం ఢీకొట్టుకోవడంతో గత ఏడాది ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన సెయింజ్తోపాటు దూహాన్ నిష్క్రమించారు. ఆ తర్వాత అలోన్సో (ఆస్టన్ మార్టిన్) 32వ ల్యాప్‌లో, గాబ్రియేల్ బొర్టోలెటో (కిక్ సాబెర్) 45వ ల్యాప్‌లో, లియామ్ లాసన్ (రెడ్‌బుల్) 46వ ల్యాప్‌లో తప్పుకున్నారు. ఓవరాల్‌గా 20 మంది డ్రైవర్లలో 14 మంది రేసును పూర్తి చేశారు. 24 రేసులతో కూడిన 2025 సీజన్లో తదుపరి రెండో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. -
నోరిస్‌కు పోల్ పొజిషన్
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ ప్రిలో మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) పోల్ పొజిషన్ సాధించాడు. 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు ఆదివారం తెర లేవనుండగా... శనివారం క్వాలిఫయింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో లాండో నోరిస్ 1 నిమిషం 15.096 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. మెల్బోర్న్లో నోరిస్‌కు ఇదే తొలి ‘పోల్’ కాగా... ఓవరాల్‌గా కెరీర్లో 10వది. ఎఫ్1 సీజన్ ప్రారం¿ోత్సవ క్వాలిఫయింగ్ టోర్నీకి శనివారం 1,36,347 మంది అభిమానులు హాజరవడం విశేషం. ‘కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ట్రాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ముందు వరుసలో నిలవగలం’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. మెక్లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) 0.084 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో పియాస్ట్రి 1 నిమిషం 15. 180 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. ట్రాక్‌పై గత నాలుగేళ్లుగా ఎదురులేకుండా దూసుకెళ్తున్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్)... క్వాలిఫయింగ్ ఈవెంట్లో మూడో స్థానంలో నిలిచాడు.వెర్స్టాపెన్ 1 నిమిషం 15.481 సెకన్లలో వేగవంతమైన ల్యాప్ పూర్తి చేశాడు. ఈ సీజన్ నుంచి ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) 1 నిమిషం 15.973 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ‘ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. కానీ ఓవరాల్‌గా సంతృప్తిగా ఉన్నా... గత రెండు రోజులుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ప్రధాన రేసులో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని హామిల్టన్ అన్నాడు. ఫెరారీ మరో డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ (1 నిమిసం 15.755 సెకన్లు; మొనాకో) ఏడో ప్లేస్‌లో, మెర్సెడెస్ డ్రైవర్ జార్జి రసెల్ (1 నిమిషం 15. 546 సెకన్లు; బ్రిటన్) నాలుగో స్థానంలో నిలిచారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. -
రయ్... రయ్... రయ్...
మెల్బోర్న్: వరుసగా ఐదో ఏడాది వరల్డ్ చాంపియన్‌గా నిలిచి దిగ్గజం మైకేల్ షుమాకర్ రికార్డును వెర్స్టాపెన్ సమం చేస్తాడా? జట్టు మారడంతో తన గెలుపు రాతను కూడా హామిల్టన్ మార్చుకుంటాడా? మూడో జట్టు తరఫున హామిల్టన్ మళ్లీ ప్రపంచ చాంపియన్‌గా అవతరిస్తాడా? ఈ ఇద్దరిని కాదని మూడో రేసర్ రూపంలో కొత్త విశ్వవిజేత ఆవిర్భవిస్తాడా? వీటన్నింటికీ సమాధానం నేటి నుంచి మొదలయ్యే ఫార్ములావన్ 75వ సీజన్లో లభిస్తుంది. 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు ఆదివారం ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో తెర లేస్తుంది. 2019 తర్వాత మళ్లీ ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రితో ఫార్ములావన్ సీజన్ మొదలుకానుండటం విశేషం. 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు శుక్రవారం ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొన్నారు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్ జరుగుతుంది. క్వాలిఫయింగ్ సెషన్లో నమోదు చేసిన అత్యుత్తమ సమయం ఆధారంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును 20 మంది డ్రైవర్లు ఏ స్థానం నుంచి ప్రారంభిస్తారో నిర్ణయిస్తారు. గత నాలుగేళ్లుగా రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ ఎదురులేని విజేతగా నిలుస్తున్నాడు. ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నుంచి వెర్‌స్టాపెన్‌కు పోటీ లభిస్తున్నా... విజయాల పరంగా వెర్స్టాపెన్ ముందుకు దూసుకెళ్తున్నాడు. మెర్సిడెస్ జట్టు తరఫున 2013 నుంచి 2024 వరకు బరిలోకి దిగిన హామిల్టన్ ఈసారి తన కెరీర్లో తొలిసారి ఫెరారీ జట్టు తరఫున డ్రైవ్ చేయనున్నాడు. 2007 నుంచి 2012 వరకు మెక్లారెన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన హామిల్టన్ 2008లో తొలిసారి వరల్డ్ చాంపియన్ అయ్యాడు. ఆ తర్వాత 2013 నుంచి 2024 మధ్య కాలంలో ఆరుసార్లు విశ్వవిజేతగా నిలిచాడు. ఈ ఏడాది వెర్‌స్టాపెన్‌కు హామిల్టన్, లెక్లెర్క్, లాండోనోరిస్, కార్లోస్ సెయింజ్ జూనియర్, జార్జి రసెల్ నుంచి గట్టిపోటీ లభించే అవకాశం ఉంది. పాయింట్లు ఎలా ఇస్తారంటే... ఫార్ములావన్‌లో ప్రతి గ్రాండ్‌ప్రి మూడు రోజులు కొనసాగుతుంది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్... శనివారం క్వాలిఫయింగ్ సెషన్... ఆదివారం ప్రధాన రేసు జరుగుతుంది. కొన్ని గ్రాండ్‌ప్రిలలో శనివారం స్ప్రింట్ రేసులను నిర్వహిస్తారు. ఈ రేసు 100 కిలోమీటర్లు జరుగుతుంది. అయితే స్ప్రింట్ రేసు ఫలితాలకు ప్రధాన రేసు ఫలితాలకు సంబంధం ఉండదు. ఇక ప్రధాన రేసులో టాప్–10లో నిలిచిన వారికి పాయింట్లు కేటాయిస్తారు. తొలి స్థానం నుంచి పదో స్థానం వరకు నిలిచిన డ్రైవర్లకు వరుసగా 25, 18, 15, 12, 10, 8, 6, 4, 2, 1 పాయింట్ లభిస్తుంది. రేసు మొత్తంలో ఫాస్టెస్ట్ ల్యాప్ నమోదు చేసిన డ్రైవర్‌కు బోనస్‌గా ఒక పాయింట్ ఇస్తారు. సీజన్‌లోని 24 రేసులు ముగిశాక అత్యధిక పాయింట్లు సాధించిన డ్రైవర్‌కు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్ లభిస్తుంది. అత్యధిక పాయింట్లు సంపాదించిన జట్టుకు కన్స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ దక్కుతుంది. ఏ జట్టులో ఎవరున్నారంటే... ఈ ఏడాది కూడా ఫార్ములావన్ టైటిల్ కోసం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు బరిలో ఉన్నారు. ఒక్కో జట్టు తరఫున ఇద్దరు డ్రైవర్లు ప్రధాన రేసులో పోటీపడతారు. ఇద్దరు డ్రైవర్లలో ఎవరైనా పాల్గొనకపోతే అదే జట్టులో ఉన్న రిజర్వ్ డ్రైవర్‌కు అవకాశం లభిస్తుంది. ఈ సీజన్లో ఆయా జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న డ్రైవర్ల వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్‌బుల్: మాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స్), లియామ్ లాసన్ (న్యూజిలాండ్). ఫెరారీ: లూయిస్ హామిల్టన్ (బ్రిటన్), చార్లెస్ లెక్లెర్క్ (మొనాకో). మెర్సిడెస్: జార్జి రసెల్ (బ్రిటన్), ఆంటోనెలి (ఇటలీ). మెక్లారెన్: లాండో నోరిస్ (బ్రిటన్), ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) ఆలై్పన్: పియరీ గ్యాస్లీ (ఫ్రాన్స్), జాక్ దూహన్ (ఆ్రస్టేలియా). ఆస్టన్ మార్టిన్: లాన్స్ స్ట్రోల్ (కెనడా), ఫెర్నాండో అలోన్సో (స్పెయిన్). హాస్: ఎస్తెబన్ ఒకాన్ (ఫ్రాన్స్), ఒలివెర్ బేర్‌మన్ (బ్రిటన్). కిక్ సాబెర్: నికో హుల్కెన్‌బర్గ్ (జర్మనీ), బొర్టెలెటో (బ్రెజిల్). రేసింగ్ బుల్స్: హాద్జర్ (ఫ్రాన్స్), యూకీ సునోడా (జపాన్) విలియమ్స్: ఆల్బన్ (థాయ్‌లాండ్), కార్లోస్ సెయింజ్ (స్పెయిన్)34 ఇప్పటి వరకు ఫార్ములావన్‌లో 34 వేర్వేరు డ్రైవర్లు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. అత్యధికంగా 7 సార్లు చొప్పున మైకేల్ షుమాకర్ (జర్మనీ), లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) టైటిల్స్ గెలిచారు. షుమాకర్ వరుసగా ఐదేళ్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచాడు. షుమాకర్ రికార్డును సమం చేసేందుకు వెర్‌స్టాపెన్‌కు ఈసారి అవకాశం లభించనుంది. గతంలో హామిల్టన్, సెబాస్టియన్ వెటెల్‌కు అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. 17 ఫార్ములావన్‌లో 17 మంది డ్రైవర్లు ఒక్కసారి మాత్రమే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచారు.105 ఫార్ములావన్ చరిత్రలో హామిల్టన్ గెలిచిన రేసులు. అత్యధిక రేసులు గెలిచిన డ్రైవర్ రికార్డు హామిల్టన్ పేరిట ఉంది. షుమాకర్ (91), వెర్స్టాపెన్ (63), వెటెల్ (53), అలైన్ ప్రాస్ట్ (51) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. 3 ఈ సీజన్లో బరిలో దిగుతున్న 20 మంది డ్రైవర్లలో ముగ్గురు ప్రపంచ చాంపియన్స్ ఉన్నారు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ (2021, 2022, 2023, 2024), తొలిసారి ఫెరారీ తరఫున పోటీపడుతున్న లూయిస్ హామిల్టన్ (2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020), ఆస్టన్ మార్టిన్ జట్టు డ్రైవర్ ఫెర్నాండో అలోన్సో (2005, 2006) మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. -
వెర్‌స్టాపెన్‌కు షాక్.. విజేతగా కార్లోస్ సెయింజ్
మెల్బోర్న్: ఫార్ములావన్ సీజన్లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్ పొజిషన్’తో ఆరంభించిన వెర్స్టాపెన్ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో నాలుగో ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ జూనియర్ విజేతగా అవతరించాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల రేసును సెయింజ్ అందరికంటే వేగంగా ఒక గంటా 20 నిమిషాల 26.843 సెకన్లలో ముగించి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఫెరారీకే చెందిన చార్లెస్ లెక్లెర్క్ రెండో స్థానంలో నిలిచాడు. 2022 బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి తర్వాత ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు టాప్–2లో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 7న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు పోల్
ఫార్ములా వన్ సీజన్లో మూడో రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్‌ను సాధించాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ 1 నిమిషం 15.915 సెకన్లలో పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో (1 నిమిషం 16.185 సె.) రెండో స్థానంలో నిలవగా...ల్యాండో నోరిస్ (మెక్లారెన్ – 1 నిమిషం 16.315 సె.)కు మూడో స్థానం దక్కింది. తొలి రెండు క్వాలిఫయింగ్లలో ముందంజలో నిలిచిన సెయింజ్నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆ తర్వాత వెర్స్టాపెన్ దూసుకుపోయాడు. వెర్స్టాపెన్ ఎఫ్1 కెరీర్లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. గత సౌదీ అరేబియా రేసుకు ముందు అపెండిసైటిస్ బారిన పడి శస్త్ర చికిత్స చేయించుకున్న సెయింజ్ సత్తా చాటాడు. పేలవ ప్రదర్శన కనబర్చిన లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్) 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. -
ఆ ఒక్క లోటునూ తీర్చేసుకున్నాడు! తొలిసారి వెర్స్టాపెన్ ఇలా..
Australian Grand Prix- మెల్బోర్న్: తన కెరీర్లో లోటుగా ఉన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఏడో ప్రయత్నంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసులో వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగాడు. మూడుసార్లు ట్రాక్‌పై ఆయా జట్ల డ్రైవర్ల కార్లు అదుపు తప్పడం లేదా ఢీ కొట్టుకోవడంతో రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. చివరకు వెర్స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్‌లను 2 గంటల 32 నిమిషాల 38.371 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రేసును ప్రారంభించిన 20 మంది డ్రైవర్లలో 12 మంది మాత్రమే గమ్యానికి చేరారు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది రెండో విజయం. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 30న జరుగుతుంది. చదవండి: IPL 2023: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు! IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో.. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో తొలి విజయమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 16.732 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో పోటీపడ్డ వెర్స్టాపెన్ 2019లో అత్యుత్తమంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌కు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు జార్జి రసెల్, లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించనుంది. రసెల్ రెండో స్థానం నుంచి, హామిల్టన్ మూడో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రెండు రేసులు జరగ్గా.. తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్పిలో వెర్స్టాపెన్, రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో సెర్జియో పెరెజ్ విజేతలుగా నిలిచారు. -
టైటిల్ వేటకు వేళాయె...!
మెల్బోర్న్: గతేడాది మాదిరిగానే ఈసారీ ఫార్ములావన్ సీజన్ తొలి గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే 2019 సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 20.486 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. 2019 ఫార్ములావన్ సీజన్లో ముగ్గురు కొత్త డ్రైవర్లు అరంగేట్రం చేయనున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్ ), రసెల్ (విలియమ్స్), అలెగ్జాండర్ అల్బోన్ (ఎస్టీఆర్) ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి బరిలోకి దిగనున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ ఫెరారీ జట్టు నుంచి అల్ఫా రోమియో జట్టుకు మారాడు. తొమ్మిదేళ్ల తర్వాత రాబర్ట్ కుబికా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. గ్రోస్యెన్ (హాస్), 7. మాగ్నుసెన్(హాస్), 8. నోరిస్ (మెక్లారెన్ ), 9. రైకోనెన్ (అల్ఫా రోమియో), 10. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 11. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 12. రికియార్డో (రెనౌ), 13. అల్బోన్ (ఎస్టీఆర్), 14. గియోవినాజి (అల్ఫా రోమియో), 15. క్వియాట్ (ఎస్టీఆర్), 16. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 17. గాస్లీ (రెడ్‌బుల్), 18. సెయింజ్ (మెక్లారె¯Œ ), 19. జార్జి రసెల్ (విలియమ్స్), 20. కుబికా (విలియమ్స్). ఉదయం గం. 10.35 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
వెటెల్‌కే టైటిల్
సాఖిర్: ఫార్ములావన్ సీజన్లో మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి రేసులో ఈ ఫెరారీ డ్రైవర్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 01.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానంలో... హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ పదో స్థానంలో, పెరెజ్ 12వ స్థానంలో నిలిచారు. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ టైటిల్ గెల్చుకున్నాడు. సీజన్‌లోని మూడో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 15న జరుగుతుంది. -
కలుషితాహారం వల్లే...
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా ఓటమి న్యూఢిల్లీ : ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో సైనా నెహ్వాల్ ఓటమికి కలుషితాహారమే కారణమని కోచ్ విమల్ కుమార్ తెలిపారు. ప్రిక్వార్టర్స్ మ్యాచ్ తర్వాత సిడ్నీలోని ఓ భారతీయ రెస్టారెంట్లో ఆమె ఆహారం తీసుకుందని చెప్పారు. దీని తర్వాత ఫుడ్ పాయిజనింగ్ కావడంతో సైనా అనారోగ్యానికి గురైందన్నారు. నీరసంతో కనీసం ప్రయా ణం చేయడానికి కూడా ఇబ్బంది తలెత్తిందని, దీని కారణంగానే ఆమె మ్యాచ్‌లో ఓటమిపాలైందని తెలిపారు. -
హామిల్టన్‌దే బోణీ
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో విజేత మెల్బోర్న్: గత సీజన్‌ను విజయంతో ముగించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ కొత్త సీజన్‌నూ విజయంతోనే ప్రారంభించాడు. ఆదివారం జరిగిన 2015 ఫార్ములావన్ సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. తద్వారా తన కెరీర్లో 34వ విజయాన్ని నమోదు చేశాడు. 58 ల్యాప్‌ల ఈ రేసును ఈ బ్రిటిష్ డ్రైవర్ గంటా 31 నిమిషాల 54.067 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. చివరి నిమిషంలో ఉపసంహరణలు... సాంకేతిక సమస్యలు... చిన్నపాటి ప్రమాదాలు... తదితర కారణాలు సీజన్ తొలి రేసును పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. విలియమ్స్ జట్టు డ్రైవర్ బొటాస్ గాయం కారణంగా... మనోర్ మారుసియా జట్టు తమ కార్లను సకాలంలో సిద్ధం చేయకపోవడంతో తొలి రేసులో పాల్గొనలేదు. ఫలితంగా 1963 తర్వాత ఒక సీజన్‌లోని తొలి రేసులో కనిష్టంగా 15 మంది బరిలోకి దిగారు. రేసు మొదలయ్యాక ఆరుగురు డ్రైవర్లు రైకోనెన్, వెర్స్టాపెన్, గ్రోస్యెన్, మల్డొనాడో, క్వియాట్, మాగ్నుసెన్ మధ్యలోనే వైదొలిగారు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ చివరి వరకు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ విజేతగా నిలిచాడు. సెకను తేడాతో మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలువగా... ఫెలిప్ మసా (విలియమ్స్) నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు టాప్-10లో నిలువడం విశేషం. హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానాన్ని ... సెర్గియో పెరెజ్ పదో స్థానాన్ని సాధించాడు. ఓవరాల్‌గా 11 మది డ్రైవర్లే రేసును పూర్తి చేయగలిగారు. ఎస్టీఆర్ జట్టు తరఫున బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ వెర్స్టాపెన్ 17 ఏళ్ల 166 రోజుల ప్రాయంలో అరంగేట్రం చేసి ఫార్ములావన్‌లో కొత్త రికార్డు సృష్టించాడు. అయితే అతనికి తొలి రేసు కలిసిరాలేదు. కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో వెర్స్టాపెన్ 32వ ల్యాప్‌లో వైదొలిగాడు. తదుపరి రేసు మలేసియా గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది. -
నాటకీయత నడుమ...
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్గ్ రెండో స్థానం పొందిన రికియార్డోపై అనర్హత వేటు వెటెల్, హామిల్టన్ విఫలం ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లిద్దరూ బోణీ రేసు పూర్తి చేయని ఏడుగురు డ్రైవర్లు మెల్బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్ సంచలనాలతో ప్రారంభమైంది. ఊహించని ఫలితాలు... ఆనందం వెంటే నిరాశ... స్టార్ డ్రైవర్ల వైఫల్యం... ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు డ్రైవర్లు రేసు పూర్తిచేయలేకపోవడం.. ఇలా పలు నాటకీయ పరిణామాల నడుమ సాగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ (జర్మనీ) గంటా 32 నిమిషాల 58.710 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా అదే జోరును కొనసాగించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) కారు ఇంజిన్‌లో ఇబ్బంది తలెత్తింది. దాంతో అతను రెండో ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు. వరుసగా 10వ విజయం సాధిస్తాడనుకున్న డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్)కు తొలి రేసు నిరాశ మిగిల్చింది. కారు ఇంజిన్‌లో సమస్య కారణంగా వెటెల్ మూడు ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు. వెటెల్ సహచరుడు, రెడ్‌బుల్‌కే చెందిన మరో డ్రైవర్ రికియార్డోకు సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది. గంటా 33 నిమిషాల 23.235 సెకన్లలో రేసును పూర్తిచేసిన రికియార్డో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బహుమతి ప్రదానోత్సవంలో షాంపేన్ విరజిమ్మడంతోపాటు రన్నరప్ ట్రోఫీనీ అందుకున్నాడు. అయితే రేసు సందర్భంగా రికియార్డో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికంటే ఎక్కువ ఇంధనం వాడినట్లు తేలింది. ఐదు గంటల విచారణ అనంతరం ఈ ఆస్ట్రేలియన్ డ్రైవర్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతని ఫలితాన్ని రద్దు చేశారు. దాంతో మూడో స్థానంలో నిలిచిన కెవిన్ మాగ్నుసన్ (డెన్మార్క్)కు రెండో స్థానం లభించింది. రేసు మొదలైన వెంటనే కొబయాషి (కాటర్‌హమ్) నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న ఫెలిప్ మసా (ఫెరారీ) కారును ఢీకొట్టాడు. దాంతో ఈ ఇద్దరూ తొలి ల్యాప్‌లోనే నిష్ర్కమించారు. సాంకేతిక సమస్యలతో గ్రోస్యెన్ (లోటస్) 43వ ల్యాప్‌లో... మల్డొనాడో (లోటస్) 29వ ల్యాప్‌లో... మార్కస్ ఎరిక్సన్ (కాటర్‌హమ్) 27వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలిగారు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు తొలి రేసు కలిసొచ్చింది. ఇద్దరు డ్రైవర్లూ పాయింట్ల ఖాతా తెరిచారు. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచి ఎనిమిది పాయింట్లు... సెర్గియో పెరెజ్ 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ సంపాదించారు. ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. ఎస్టీఆర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన క్వియాట్ తొమ్మిదో స్థానంలో నిలిచి రెండు పాయింట్లు సాధించాడు. -
హామిల్టన్‌కు ‘పోల్’
వెటెల్ విఫలం టాప్-10లో ‘ఫోర్స్’ హుల్కెన్బర్ నేడు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి మెల్బోర్న్: చివరాఖర్లో వేగం పెంచిన మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్-2014 సీజన్ లో తొలి ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్‌గా నిలిచా డు. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 44.231 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ రౌండ్లలో అంతగా ఆకట్టుకోని హామిల్టన్ నిర్ణయాత్మక మూడో రౌండ్లో జోరు పెంచి మిగతా డ్రైవర్లను వెనక్కి నెట్టాడు. రికియార్డో (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి... రోస్‌బర్గ్ (మెర్సిడెస్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తోన్న రెడ్‌బుల్ స్టార్ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్)కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసిరాలేదు. రికార్డుస్థాయిలో వరుసగా పదో విజయంపై దృష్టి సారించిన వెటెల్ 2012లో అబుదాబి రేసు తర్వాత తొలిసారి క్వాలిఫయింగ్ రెండో రౌండ్‌ను దాటలేకపోయాడు. ఓవరాల్‌గా అతను ప్రధాన రేసును 12వ స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. నికో హుల్కెన్‌బర్గ్ ఏడో స్థానం నుంచి... మరో డ్రైవర్ పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు.